వార్ని.. తండ్రి కాబోతున్న పుతిన్.. 69 ఏళ్ల వయసులో?

praveen
గత కొంతకాలం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం రష్యా ఉక్రెయిన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు. సరిహద్దు దేశం అయిన ఉక్రెయిన్ ను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు రష్యా ముందు హెచ్చరికలు చేసింది. ఆ తర్వాత సైనిక చర్య పేరుతో ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత నాలుగు నెలల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.

 ఇక ఈ యుద్ధ నేపథ్యంలో అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయ్ అని చెప్పాలి. అదిగో యుద్ధం ఆపేస్తారు ఇదిగో యుద్ధం ఆపేస్తారు అని అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ పుతిన్ మాత్రం ఎక్కడా యుద్ధం ఆపేందుకు సానుకూలంగా స్పందించడం లేదు. ఇంకా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజుల నుంచి పుతిన్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇప్పుడు మరోసారి పుతిన్ వార్తల్లోకి వచ్చాడు.

 అయితే  ఈ సారి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కారణంగా కాదు ఏకంగా 69 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు అనే వార్తతో అందరిని ఆశ్చర్య పరిచాడు పుతిన్. ఇక ఈ విషయాన్ని జనరల్  ఎస్విఆర్ టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రేయసి మాజీ జిమ్నాస్ట్ అలీనా కబాయోవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగనిర్ధారణ పరీక్షలు ఆడపిల్ల అని తేలినట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. సంచలనంగా మారిపోయాయ్. ఈ విషయం బయట పడకుండా ఆమెను రహస్యంగా  స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: