పాము చేసిన పనికి.. 10 వేల కుటుంబాలకు కరెంట్ కట్?

praveen
సాధారణంగా పామును చూస్తే ప్రతి ఒక్కరు బెంబేలెత్తి పోతుంటారు అనే చెప్పాలి. పాము కాటు వేసింది అంటే చాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకూ పాము కాటు వేసి ఎంతో మంది ప్రాణాలు తీయడం వంటి ఘటనలు ఎంతో మంది విని చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పాము చేసిన పనికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 వేల కుటుంబాలు కూడా నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ్ చెప్పాలి. ఈ ఘటన జపాన్ లో వెలుగులోకి వచ్చింది. జపాన్లోని ఫుకుషిమ ప్రాంతంలోని కొరియామా నగరవాసులు ఇటీవలే ఉన్నట్టుండి  కరెంటు పోవడంతో ఆందోళన చెందారు.

 ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. అదే సమయంలో  కరెంటు లేకపోవడంతో తీవ్ర  ఇబ్బంది పడిపోయారు. ఏకంగా పది వేల ఇళ్ళల్లో కరెంటు లేకుండా పోయింది. దీంతో ఇక విద్యుత్ అధికారులకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు.. దీంతో విద్యుత్ అధికారులు కూడా ఎక్కడ సమస్య తలెత్తి ఉంటుందా అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సబ్స్టేషన్లో సమస్య ఉంది అన్న విషయం అధికారులకు అర్థమైంది. అయితే ఆ సమస్య పాము కారణంగా వచ్చింది విషయాన్ని తెలుసుకుని అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.  విద్యుత్ సరఫరా మిషన్ లోకి ఒక పాము ప్రవేశించగానే షాక్ తగిలి మాడిపోయింది.

 తద్వారా చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ జరిగింది.  ఇక ఆ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే 10 వేల కుటుంబాలకు కరెంట్ కట్ అయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గమనించిన విద్యుత్ సిబ్బంది ఇక్కడ పాము చొరబడిన చోట మంటలు వ్యాపిస్తూ ఉండటాన్ని గమనించి అగ్నిమాపక వాహనాలు ఆ ప్రాంతానికి రప్పించి చివరికీ సమస్యను పరిష్కరించారు. అయితే ఇలా ఒక పాము కారణంగా ఏకంగా గంటల పాటు పది వేల కుటుంబాలకు షాపులకు కరెంట్ లేకుండా పోయింది అని చెప్పాలి. పాము కారణంగా ఇలాంటి కరెంటు కోత ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: