అతి పెద్ద మంచినీటి చేప.. ఎన్ని అడుగులు ఉందో తెలుసా?

praveen
సాధారణంగా జాలరులు ఎప్పుడూ సముద్రంలో చేపల వేటకు వెళుతూ ఉంటారు . కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం జాలర్ల వలకు  అరుదైన చేపలు చిక్కుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి అరుదైన చేపలు జాలరుల వలకు చిక్కాయి అంటే చాలు.. ఇక అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రపంచంలోనే అతి పెద్ద చేప కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపను గుర్తించారు పరిశోధకులు.

 అయితే ఈ చేపను పెద్ద చేప అని ఎలా నిర్ధారించారు అనే కదా మీ డౌట్.. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకొని ఇక ఇదే అతి పెద్దది అనే విషయాన్ని తేల్చారు పరిశోధకులు. సుమారు 13 అడుగుల పొడవు దాదాపు 300 కిలోల బరువు ఉంది అనే విషయాన్ని తెలిపారు. కాంబోడియా మెకాంగ్ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పది మందికి పైగా జాలర్లు ఇక ఈ చేపను ఎంతో కష్టంగా ఒడ్డుకు లాక్కొచ్చారు అని చెప్పాలి. క్రిస్టెన్ బోరమీ అని దీనిని  పిలుస్తూ ఉంటారట.  ఇక దీనికి పూర్తి చంద్రుడు అనే అర్థం వస్తుంది. అయితే ఈ చేప ఆకారం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అని తెలుస్తోంది.

 అయితే ఇక అరుదైన చేప తమ వలకు చిక్కింది అని జాలర్లు ఎంతో సంతోష పడి పోయారు. కానీ పరిశోధకులు జాలర్ల తో మాట్లాడి ఎలక్ట్రానిక్ ట్యాగుతో తిరిగి నీళ్ళల్లోకె అతిపెద్ద చేపను వదిలేయడం గమనార్హం. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించ బోతున్నారు పరిశోధకులు. కాగా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో మాన్స్టర్ షిప్ సో నిర్వాహకుడు అయిన జెబ్ హోగన్ దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేప అంటూ నిర్ధారించడం గమనార్హం. ఇంతకుముందు 2005లో థాయిలాండ్ లో 293 కిలోల బరువు ఉన్న ఓ క్యాష్ ఫిష్ ను అతి పెద్ద చేప గా గుర్తించారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: