షాకీచ్చిన కిమ్.. 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలు?
బ్రతికున్నంత కాలం కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ప్రపంచం మొత్తం ఒక వైపు నడుస్తూ ఉంటే అటు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం మరో వైపు నడుస్తూ ఉంటారు. నా దారి రహదారి అనే రేంజ్ లో వ్యవహరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అటు ఉత్తర కొరియాల్లొ తీవ్ర స్థాయిలో ఆహార సంక్షోభం ఏర్పడింది. అక్కడి ప్రజలందరూ కూడా తిండి దొరక్క అల్లాడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోదేశంలో ఆహార సంక్షోభాన్ని తీర్చాల్సిన అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వరుసగా క్షిపణుల కు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఉండడం సంచలనంగా మారింది.
ఈ క్రమం లోనే అగ్రరాజ్యమైన అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా కిమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అన్నది తెలుస్తుంది.ఇటీవల రాజధాని ప్యాంగాంగ్ సమీపంలో 35 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఎనిమిది బాలిస్టిక్ మిసైల్స్ కి పరీక్షలు నిర్వహించడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. త్వరలోనే మళ్లీ అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించటానికి జాతీయ భద్రత మండలి సమావేశం నిర్వహించబోతున్నారట. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.