విమానం గాల్లో ఉండగా.. నిద్రపోయిన పైలెట్.. చివరికి?
కొన్నిసార్లు విమానం లో సాంకేతిక సమస్యలు తలెత్తడం కారణం గా విమానం ల్యాండ్ అవడానికి ఇబ్బందులు ఎదురు కావడం జరుగుతుంది. మరికొన్ని సార్లు పైలెట్ తప్పిదాల కారణం గా విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. విమానాన్ని నడిపిస్తున్న పైలెట్ ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాలి. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ చేస్తూ విమానాన్ని గమ్య స్థానానికి చేర్చాలీ. కానీ కొంతమంది పైలెట్లు మాత్రం కాస్త నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే చేశాడు ఒక పైలెట్.
ఎంతో మంది ప్రయాణికుల తో బయలు దేరిన విమానాన్ని గమ్యస్థానానికి చేరుకుంటుందన్న సమయంలో పైలెట్ హాయిగా నిద్రపోయాడు. దీంతో విమాన ప్రయాణికులు అందరూ భయాందోళనలో మునిగిపోయారు.. న్యూయార్క్ నుంచి రోమ్ వెళ్తున్న ఐటిఏ ఎయిర్ లైన్స్ కు చెందిన జెయే609 విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం నడిపే పైలట్ నిద్రపోయాడు. పది నిమిషాలపాటు కమ్యూనికేషన్ జరగలేదు. ఇక ఫ్రాన్స్ అధికారులు ఉగ్ర దాడులు జరిగినట్లు ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత విచారణలో పైలెట్ ఆటో పైలెట్ మోడ్ ఆన్ చేసి నిద్రపోయినట్లు తేలింది..