అమెరికా డబుల్ గేమ్.. తైవాన్ ను నట్టేట ముంచుతుందా?
ఇక ఈ వివాదంలోకి అటు అమెరికా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అటు తైవాన్ కు దీటుగా బదులిస్తూ వచ్చింది. కానీ బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తైవాన్ విషయంలో అమెరికా డబుల్ గేమ్ ఆడుతూ వస్తుంది అని చెప్పాలి. ఇటీవల క్వాడ్ దేశాల మీటింగ్ సందర్భంగా తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు అంటూ ప్రశ్నించగా తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బైడెన్ తేల్చిచెప్పారు.
ఇక ఆ తర్వాత కొన్ని గంటలకి తాము వన్ చైనా పాలసీకీ మద్దతు ప్రకటిస్తున్నామని అనధికారిక కార్యాలయం వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన విడుదల కావడం గమనార్హం. ఇలా అమెరికా డబుల్ గేమ్ కాస్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఉక్రెయిన్ విషయంలో కూడా ఇలాగే అమెరికా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కు ముందుగా మద్దతు ఇస్తామని రష్యా యుద్ధం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కానీ ఆ తర్వాత మాత్రం యుద్ధం సంభవించిన తరువాత ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వకుండా దొంగ దెబ్బ తీసారూ అని చెప్పాలి ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తుంది.