95 ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి.. ఎక్కడో తెలుసా?

praveen
ప్రేమ ఎంతో మధురమైనది.. ఇక ఎప్పుడూ ఎవరి మధ్య ఏ క్షణంలో ప్రేమ పుడుతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా యువతీ యువకులు ప్రేమలో పడతారు అని ఎంతోమంది ఉదాహరణగా చెబుతుంటారు. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది అని ఎంతోమంది నిరూపిస్తూ ఉంటారు. యుక్త వయసులో ఉన్నప్పుడు కలవలేకుండా ఎంతో బాధపడి పోయిన ప్రేమికులు ఇక వృద్ధాప్యంలో మాత్రం ఏదో ఒక విధంగా కలిసి మళ్లీ పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 వయసులో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల కారణాలతో విడిపోయినవారు. వృద్ధాప్యంలో మాత్రం ప్రేమించిన వారి తోడు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతను తనకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అనే కారణంతో పెళ్ళికి దూరంగా బ్రహ్మచారిగానే ఉండిపోయాడూ. కానీ తనను అర్థం చేసుకునే అమ్మాయి మాత్రం తన జీవితంలోకి తప్పకుండా వస్తుంది అని నమ్మకం మాత్రం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇలా ఎదురు చూస్తూ అతని యుక్తవయస్సు మొత్తం కరిగి పోయింది. చివరికి 95 ఏళ్ల వయసులో అతనికి అర్థం చేసుకునే మహిళా దొరికింది.

 ఈ క్రమంలోనే  ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ భావించిన సదరు వ్యక్తి 95 ఏళ్ల పాటు బ్రహ్మచారి గా ఉండి ఇటీవలే 84 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. బ్రిటన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జూలీయాన్ అనే వ్యక్తి 95ఏళ్ళ తర్వాత వలేరియా విలియమ్స్ అనే 84 ఏళ్ల మహిళను బంధువుల సమక్షంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య 23 ఏళ్ల కిందట ఒక చర్చిలో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తరచు కలుసుకుని ఆలోచనలు పంచుకోవడంతో ఓరోజు జూలియన్ తన ప్రేమను ఆమెకు వ్యక్తపరిచాడు. ఆమె కూడా ఒప్పుకుంది. ఇక వీరిద్దరు మొదటిసారి కలిసిన చర్చ్ లోనే పెళ్లి చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: