
వామ్మో.. 11 మంది ఆసుపత్రి సిబ్బంది.. ఒకేసారి ప్రెగ్నెంట్?
అది సరే గానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. ఇటీవలే ఓ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మొత్తం గర్భం దాల్చడం ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. గర్భం దాల్చారు అనగానే ఏదో క్రైమ్ న్యూస్ అనుకోకండి.. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది గుడ్ న్యూస్ గురించి. సాధారణంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిలో ఒకరు ఇద్దరు ఒకే సమయంలో గర్భం దాల్చడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు ఏకంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది మొత్తం ఒకేసారి గర్భం దాల్చడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ ఘటన అమెరికాలోని మిస్సౌరీ లిబర్టీ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేసే 11 మంది మహిళా సిబ్బంది కొన్ని నెలల వ్యవధిలోనే గర్భం దాల్చడం ప్రస్తుతం విశేషం గా మారిపోయింది. ఈ సిబ్బంది లో పది మంది నర్సులు గా పనిచేస్తూ ఉండగా ఒకరు డాక్టర్ గా పని చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాదండోయ్ ఈ అందరూ సిబ్బంది కూడా అటు ప్రసూతి వార్డులో నే విధులు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. అయితే ఒక వైపు నెలలు నిండుతున్నప్పటికి రెట్టింపు ఉత్సాహంతో విధులకు హాజరవుతున్నారు సిబ్బంది. ఇటీవలే అందరూ కలిసి ఒకేసారి విధులకు హాజరైన సమయంలో దిగిన ఒక ఫోటో కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..