శరీరమంతా ప్లాస్టిక్ సర్జరీ.. ఎలా మారిపోయిందో చూడండి?

praveen
సాధారణంగా ఇటీవల కాలంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి లేదా తన ముఖంలో కొన్ని మార్పులు చేసుకోవడానికి సర్జరీలు చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇలా సర్జరీలతో మరింత అందంగా మారిపోతూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు సర్వసాధారణంగా మారిపోయాయి. సాధారణంగా ఇప్పటివరకు కేవలం ముఖంపైన సర్జరీలు చేసుకోవడం లాంటివి చూశాము. శరీరం మొత్తం సర్జరీలు చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా. అయినా శరీరం మొత్తం సర్జరీలు ఎవరు చేసుకుంటా రండి అలాంటి పిచ్చి పని ఎవరైనా చేస్తారా అని అంటారు అందరు.

 అలా అనుకున్నారంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ ఏకంగా శరీరమంతా సర్జరీ చేయించుకుంది. పాపులర్ పోర్న్ స్టార్స్   కాన్ మార్లిన్, మన్రో బార్బీ లను చూస్తూ పెరిగిన ఒక అమ్మాయి పెద్దయిన తర్వాత అచ్చం వారి లాగే మారాలని అనుకుంది. అంతేకాదు స్కూల్ దశలో ఉన్నప్పుడే తనలో డీప్ సెక్సువల్ ఎనర్జీ ఉంది అంటూ తెలుసుకున్నాను అంటూ చెబుతోంది. నువ్వు పోర్న్ స్టార్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎంతో మంది చెప్పారు. తనకు నచ్చిన విధంగా తన బాడీని మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న అంటూ చెబుతుంది సదరు అమ్మాయి. ఇక ఈ ప్లాస్టిక్ సర్జరీలు ఊరికే కాలేదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.

 యుకెకు చెందిన డాలి అనే 28 ఏళ్ల అమ్మాయి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో వార్తల్లో నిలిచింది. సెక్సీగా కనిపించాలని కుతూహలంతో 20 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ   చేయించుకుని వక్షోజాల పరిణామం పెరిగేలా చేసుకుంది. చర్మ సౌందర్యం గురించి ఎన్నో ట్రీట్మెంట్ చేయించుకుంది. బార్బీ బొమ్మల కనిపించేందుకు లిప్స్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. సన్నటి నడుము పక్కటెముకల విషయంలో కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం కోసం వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే తనలాంటి కోరికలతో ఉన్న బింబో కమ్యూనిటీని కలిసిన తర్వాత మరింత ఆనందంగా ఉన్నాను అంటూ చెబుతుంది డాలి. తనను ఒకప్పుడు వెక్కిరించిన పురుషుల ఇప్పుడు కాంప్లిమెంట్ ఇస్తున్నారని కానీ అమ్మాయిలు మాత్రం ఇంతటి అందాన్ని జడ్జి చేస్తున్నారని చెబుతోంది. ఏదేమైనా ప్లాస్టిక్ సర్జరీ లతో సదరు యువతి మారిపోయిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: