చైనా మరో అద్భుతం.. వారంలో 50 వేల పడకల ఆసుపత్రి?

praveen
చైనా కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టింది అని అందరూ తిట్టుకుంటూ ఉంటాం. ప్రపంచ దేశాలలో సంక్షోభానికి చైనా కారణం అంటూ దుమ్మెత్తి పోస్తూ ఉంటాము. ఇలా చైనా కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించింది కూడా నిజమే. ఇదంతా పక్కన పెడితే అటు చైనా చేసే కొన్ని అద్భుతమైన పనులు మాత్రం అప్పుడప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. కేవలం రోజుల వ్యవధిలోనే ఆస్పత్రులు నిర్మించడం కేవలం చైనా కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 గతంలో వారం రోజుల వ్యవధిలో వేల పడకల ఆసుపత్రిని నిర్మించి రికార్డు సృష్టించింది చైనా. ఇక ఇప్పుడు మరో సారి చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసి చూపించింది. ఏకంగా వారం రోజుల వ్యవధిలోనే 50000 పడకలతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేపట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చైనా. మొన్నటి వరకు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇక ఇప్పుడు చైనాలో విజృంభిస్తుంది. కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాలలో లాక్డౌన్ పెడుతున్న ప్పటికీ  అక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావడం లేదు అని చెప్పాలి.

 రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ఆస్పత్రులలో సదుపాయాలు సరిపోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే వారం రోజుల్లోనే 50 వేల పడకలతో నిర్మాణం చేపట్టింది చైనా. చైనా వాణిజ్య నగరం అయిన షాంఘైలో ఇలా కరోనా బాధితుల కోసం అతిపెద్ద తాత్కాలిక ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆరు లక్షల వేరు మీటర్ల విస్తీర్ణంలో 50వేల పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మించింది. రోగులకు వైద్య సిబ్బందికి అత్యంత అనుకూలంగా ఉండే విధంగా ఇక ఆసుపత్రు నిర్మాణం లో శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపింది. ఈనెల 3వ తేదీన నిర్మాణం ప్రారంభం కాగా ఇక 9వ తేదీకి వినియోగంలోకి రావడం గమనార్హం. పదివేల మంది ఈ ఆసుపత్రి నిర్మాణం లో పాల్గొన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: