భారత్ ని ప్రశ్నించే దమ్ము అమెరికాకు లేదు : ఇమ్రాన్ ఖాన్

praveen
పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ కి ఎప్పుడు భారత్ పై అక్కసును వెళ్లగక్కుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఎప్పుడూ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇక రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఒక దేశ ప్రధాన మంత్రిగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడూ. అయితే ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసలు కురిపించడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటి ఇమ్రాన్ఖాన్ పదవికి ప్రస్తుతం ఎసరు పడింది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ తిరుగుబాటు నేపథ్యంలో చివరికి ఇమ్రాన్ఖాన్ పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

 పాకిస్తాన్ పార్లమెంట్ లో బల నిరూపణ చేసుకుంటేనే ఇమ్రాన్ఖాన్ పదవి నిలబడుతుంది. లేదంటే చివరికి పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భారత్ గురించి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. మొన్నటికి మొన్న భారత విదేశాంగ విధానం ఎంతో బాగుంటుంది అంటూ వ్యాఖ్యానించిన ఇమ్రాన్ ఖాన్ ఇక తన వ్యాఖ్యలతో అందరికీ షాకిచ్చాడు. భారత్ తమ పౌరుల కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది అంటూ మొట్టమొదటిసారి భారత్ మీద ప్రశంసలు కురిపించాడు ఇమ్రాన్ ఖాన్.

 ఇక ఆ తర్వాత రోజే మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కక్కి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు మరో సారీ భారత విదేశాంగ విధానం గురించి గొప్పగా వ్యాఖ్యానించాడు. భారత దేశానిది స్వతంత్రం అయిన విదేశాంగ విధానం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియా పాస్పోర్టును ప్రపంచమంతా గౌరవిస్తుంది అంటూ తెలిపాడు. తాను రష్యా కు వెళితే అమెరికా నన్ను ప్రశ్నిస్తుంది. అయితే అమెరికా ఆంక్షలు విధించిన రష్యా నుంచి అటు భారత్ మాత్రం అన్ని రకాల లావాదేవీలను జరుపుతుంది. కానీ భారత్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం అమెరికాకు లేవు అంటూ ఇమ్రాన్ఖాన్ వ్యాఖ్యానించాడు. ఇక పాకిస్తాన్ ప్రధాని కాస్త భారత్ గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: