చేసిన పాపం ఎటు పోతుంది.. చైనాను అది వెంటాడుతుంది?

praveen
కరోనా వైరస్ అనే బయో వెపెన్ సృష్టించి ఇక ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నించింది అన్నది ఇక ప్రపంచం ఎరిగిన నిజం. కరోనా వైరస్ తో తమకు సంబంధం లేదని కరోనా వైరస్ ఎలా పుట్టిందో కూడా తనకు తెలియదు అంటూ ఎన్నో కల్లబొల్లి మాటలు చెబుతూ ఉంటుంది చైనా. చైనా కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలు దాచిపెట్టిన కారణంగానే అటు ప్రపంచ దేశాలు మొత్తం ఊహించని సంక్షోభంలో కూరుకుపోయాయ్.. మూడు దశల పాటు కరోనా వైరస్ ఇప్పుడు వరకు ప్రపంచదేశాలను పట్టి పీడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కరోనా వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి.

 అయితే మొన్నటి వరకు ప్రపంచ దేశాలు పట్టి పీడించి ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ కు ఇక ఇప్పుడు పుట్టినిల్లు అయిన చైనాపై తెగ ప్రేమ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో అదే కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు.  రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతున్నా నేపథ్యంలో ఎన్నో నగరాలు పట్టణాలు మళ్లీ ఆంక్షల దిగ్బంధంలో కి వెళ్లి పోతున్న పరిస్థితి ఏర్పడింది. జీరో టాలరెన్స్ పేరు చెబుతూ ఇక తక్కువ కేసులు ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలలో ఆంక్షలు విధిస్తున్న కేసుల సంఖ్య మాత్రం కంట్రోల్ కావడం లేదు.

 చైనాలోని షాంగై నగరంలో ప్రతి రోజూ ఆరు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. హంకాంగ్ లో మూడు వేలకు పైగా కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి. దీంతో ఆసుపత్రిలో కనీసం బెడ్స్ కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక పదేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు దగ్గరికి కూడా రానివ్వకుండా  డైరెక్ట్ గా ఆసుపత్రులకు తీసుకెళ్తున్న దుస్థితి చైనాలో ఏర్పడింది. అంతేకాదు ఇక తమ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులను ఆస్పత్రిలో దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదట . ఇలా చైనా సృష్టించిన కరోనా వయసు ఇప్పుడు ఆదే చైనా ను వెంటాడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: