యుద్ధం : 17 వేల మంది రష్యన్ సైనికులు మృతి?

praveen
స్వతంత్ర దేశంగా కొనసాగుతున్న ఉక్రెయిన్  ఇక యూరోపియన్ యూనియన్ తో కలిసేందుకు సిద్ధమవడం చివరికి యుద్ధానికి దారి తీసింది. అలా కలవడానికి ఒప్పుకోము.. కాలిస్తే ఊరుకోము అంటూ హెచ్చరించిన రష్యా చివరికి ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. అయితే అమెరికా అండదండలు చూసుకుని ఇక అగ్ర దేశమైన రష్యాతో యుద్ధం చేసేందుకు సిద్ధమైనా ఉక్రెయిన్ కు ఇక చేదు అనుభవమే ఎదురైంది. అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ఎలాంటి ఆయుధ సహకారం అందకపోవడంతో చివరికి చిన్న దేశమైన ఉక్రెయిన్ అగ్ర దేశమైన  రష్యాతో ఒంటరిగానే పోరాటం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

 అయితే అటు రష్యా సైన్యం బలం చూసిన తర్వాత రెండు మూడు రోజుల్లో రష్యా ఎంతో సునాయాసంగా ఉక్రెయిన్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ యుద్ధం మొదలై నెల రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు అని చెప్పాలి. అంతేకాదు అటు ఉక్రెయిన్ సైనికులు ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఉక్రెయిన్ సైనికుల తెగింపు ముందు రష్యా సైన్యం దూకుడు తగ్గిపోతుంది అని ప్రస్తుతం అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సైన్యం వేలమంది రష్యా సైనికులను మట్టు పెడుతూ ఉంది.

 ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా సేనలను తమ సైనికులు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పుడు వరకు యుద్ధంలో ఏకంగా 17 వేల మందికి పైగా రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణ  శాఖ వెల్లడించడం గమనార్హం. అంతేకాకుండా రష్యాకు చెందిన 123 విమానాలు, 127 హెలికాప్టర్లతో పాటు 586 యుద్ధ ట్యాంకులు 73 ఇంధన ట్యాంకులు 1694 సాయుధ శకటాల తో పాటు భారీగా యుద్ధ సామాగ్రిని సైతం మట్టు పెట్టినట్లు ఇక ఇటీవలే రక్షణ శాఖ ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: