మేం రంగంలోకి దిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే : అమెరికా

praveen
ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య యుద్ధం పదిరోజులు దాటిపోతున్నప్పటికీ ఎక్కడా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎక్కడ వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ లో జనావాసాలు సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది  రష్యా. ఈ క్రమంలోనే ఈ క్షణంలో ఎటు వైపు నుంచి వచ్చి బాంబు పడుతుందో.. ప్రాణాలు గాల్లో కలిసి పోతాయో అని అటు ఉక్రెయిన్ ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి..

 ఇక రష్యా భీకర దాడుల నేపధ్యంలో ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అటు ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా రహస్యంగా ఆయుధ  సహకారం అందిస్తూనే మరోవైపు రష్యా పై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తుంది  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యుద్ధం విరమించాలి అంటూ రష్యాకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి రష్యా కు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా పోరులో అమెరికా తలదూర్చితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిణామాలను తీసుకు రావడం ఇష్టం లేకే నాటో దళాలు యుద్ధంలోకి రావడంలేదని వ్యాఖ్యానించారు బైడెన్.

 యూరోప్ లో ఉన్న అమెరికా మిత్ర దేశాలకు ఎప్పుడూ సహాయం చేస్తాము ఇక నాటో భూభాగంలోని ప్రతి అంగుళం కూడా రక్షించుకుంటాం. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తరఫున యుద్ధం మాత్రం చేయము అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ లో రష్యా విజయం సాధించడం కలే అవుతుంది. ఉక్రెయిన్ పై పోరాటం లో  రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తిగా విఫలం అయి పోయారు. ఇక నాటో కూటమి మరింత బలహీన పరచాలని పుతిన్ కుయుక్తులు కాస్త చివరికి విఫలమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా రసాయనిక దాడి చేయడానికి సిద్ధమైతే అస్సలు సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సరిహద్దులకు 12 వేల మంది అమెరికా సైనికులను పంపించాం.. రష్యా మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైనా తేడా జరిగితే చూస్తూ ఊరుకోబోమని అంటూ హెచ్చరించారు బైడెన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: