రష్యాలో సంక్షోభం.. చైనాకు వరం?
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సేనలు రష్యాకు దీటుగానే బదులిస్తున్నాయి. అయితే యుద్ధం సమయంలో వెన్నంటే ఉంటాను అంటూ హామీ ఇచ్చిన అమెరికా నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రస్తుతం ఎలాంటి ఆయుధ సహకారం అందించకుండా ఉక్రెయిన్ ను ఒంటరిగా వదిలేసాయ్. కానీ అమెరికా మాత్రం అన్ని రకాల ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. రష్యాతో అన్నీ సంబంధాలను కట్ చేసుకుంటున్నాయ్.. ఎలాంటి దిగుమతులు చేసుకోము అంటూ ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు ప్రకటించాయి. ఇలాంటి సందర్భంలోనే ముడిచమురు పై కూడా నిషేధం విధించాయి అన్న విషయం తెలిసిందే.
దీంతో ప్రస్తుతం రష్యాలో ఆయిల్ నిల్వలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇది తమ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇలా రష్యా లో నెలకొన్న సంక్షోభం చైనాకు వరంలా మారిపోతుంది అని తెలుస్తోంది. ఆయిల్ దిగుమతులపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో ఇక దీనిని ఉపయోగించుకుంటున్న చైనా భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తమ దేశంలో ఆయిల్ ఉత్పత్తి లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి అంటూ రష్యా సబ్సిడీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇప్పటికే రష్యాలో ఎన్నో పెట్టుబడులు పెట్టిన చైనా ఇక మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇలా రష్యా లో నెలకొన్న సంక్షోభం చైనాకు వరంలా మారిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.