రష్యాతో యుద్ధం.. ప్రజల ప్రాణాలకే ఎసరు పెడుతున్న జెలెన్ స్కీ?

praveen
యుద్ధంలో రష్యా విరుచుకుపడుతుంది. పసి కూనలాంటి ఉక్రెయిన్ పై ఎక్కడ మానవత్వం చూపించడం లేదు. సైనిక స్థావరాలు జనావాసాలు అనే తేడా లేకుండా యుద్ధ విమానాలతో భీకర రీతిలో దాడులకు పాల్పడుతోంది. ఇక అదే సమయంలో బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తుంది రష్యా. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదు అంటూ అటు ఉక్రెయిన్ కూడా రష్యా సైన్యం తో వీరోచితంగా పోరాటం చేస్తోంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం పది రోజులు దాటిపోయింది.

 ఇలాంటి సమయంలోనే ఇక రష్యా సైనికులను వేల మందిని తమ సైన్యం హతమార్చిందనీ.. ఎన్నో యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది అంటూ రక్షణశాఖ స్టేట్మెంట్ ఇస్తోంది. హెలికాప్టర్లు యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది అంటూ చెబుతుంది. కాని ఈ యుద్ధంలో తమ దేశ సైనికులు ఎంతమంది చనిపోయారు అన్న విషయాలను మాత్రం రహస్యంగా ఉంచుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఇక రష్యాతో యుద్ధానికి ప్రస్తుతం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది అంటూ అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది.

 ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలను ముందు ఉంచి ఇక ఉక్రెయిన్ సైన్యం వారి వెనక యుద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఇక ఉక్రెయిన్ లో ఉన్న మగ వారు అందరికీ కూడా రష్యా సైనికులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా ఇస్తున్నారట. యుద్ధనీతి ప్రకారం ప్రజలకు సైనికులు ఎలాంటి హానీ కలిగించకూడదు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రజలను ముందు పెట్టి సరికొత్త నాటకానికి తెర లేపిందట ఉక్రెయిన్ ప్రభుత్వం. ఇలా తుపాకీ కి పని చెప్పకుండా ఇక దగ్గరికి వచ్చే రష్యా సైనికుడిని  ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై ఇక పౌరులకు శిక్షణ ఇస్తూ వారి ప్రాణాలకే ఎసరు పెట్టింది అంటూ ఒక అంతర్జాతీయ మీడియాలో టాక్ వైరల్ గా మారింది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: