షాకింగ్ : దేశం విడిచిన ఉక్రెయిన్ అధ్యక్షుడు?

praveen
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఇది ఒక్కటే.. ఎన్నో రోజులనుంచి ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయ్. ఈ క్రమంలోనే లక్షల మంది సైనికులను మోహరించి రష్యా యుద్ధ విన్యాసాలు చేయడంతో మరింత ఉధృతం గా మారిపోయింది పరిస్థితి. ఆ తర్వాత తమ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తున్నాము అంటూ రష్యా ప్రకటించింది. కానీ అంతలోనే ఎవరూ ఊహించని విధంగా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది.


 అన్ని దేశాలు షాక్ నుంచి తేరుకునేలోపే ఇక ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించింది రష్యా. ఈ క్రమంలోనే ఇక వెంటనే ఉక్రెయిన్ సైన్యం కూడా అప్రమత్తమైంది.. రష్యా సేనలను అడ్డుకొనేంత బలం లేకపోయినప్పటికీ గుండె ధైర్యంతో రష్యాతో పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎప్పటికప్పుడు అటు సైన్యంలో ధైర్యం నింపుతూ ముందుకు నడిపించాడు. ఒకానొక సమయంలో సైనికుడు యూనిఫామ్ వేసుకొని యుద్ధ రంగంలో దిగి పోరాడేందుకు కూడా సిద్ధమయ్యారు. అంతే కాదు దేశం కోసం యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చిన ఆయుధాలు ఇస్తామంటూ ప్రకటించారు.



 ఇలా ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు పై ప్రశంసలు కురిపించారు. అయితే ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆయన పోలాండ్లో దాక్కున్నారని రష్యన్ మీడియా ఒక కథనం  ప్రచురితం చేసింది. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే గతంలో కూడా జెలెన్ స్కీ పారిపోయినట్లు వార్తలు రాగా.. ఆయన వాటిని కొట్టిపారేస్తూ తాను కీవ్ నగరంలోనే ఉన్నాను అంటూ విడుదల చేశారు.. దీంతో ఇక ప్రస్తుతం వార్తల్లో నిజం ఎంత ఉంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.  జెలెన్ స్కీ ను హతమార్చేందుకు రష్యన్ ప్రైవేటు సైన్యం కీవ్ నగరంలో అడుగుపెట్టింది అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: