నోరూరించే టీవీ.. నాకితే రుచి కూడా తెలుస్తుందట?
తొందరపడి రుచి ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి ఒకవేళ టీవీని నాటితే రుచి కూడా తెలుస్తోంది. అవును ఇలాంటి టీవీ ని ఇటీవలే జపాన్లో కనుగొన్నారు. టేస్ట్ ద టీవీ పేరుతో ఒక సరికొత్త డివైస్ ను రూపొందించారు. ఇందులో ప్రోటోటైప్ తెరచి ప్రత్యేకమైన సెట్ అప్ ద్వారా కొన్ని టేస్ట్ ట్యూబ్ మెను అమర్చుతారు. దీంతో తెరపై కనిపించే అన్ని రకాల ఆహార పదార్ధాలను నాకి టేస్ట్ చూసేందుకు అవకాశం ఉంటుంది అంతే కాదు మీకు నచ్చినది టేస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందట. ఒకవేళ మీరు టీవీ దగ్గరికి వెళ్లి చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పారు అంటే చాలు తెర మీదకి ఇక ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుందట.
జపాన్కు చెందిన ప్రసిద్ధమైన 10 వంటకాల రుచులను మాత్రమే ఈ టీవీ తెలియజేస్తుందని తయారు చేసిన వారు చెబుతున్నారు. త్వరలో ఈ టీవీ ని మరింత అప్డేట్ చేయబోతున్నామని ఇక అన్ని రకాల రుచులను కూడా ఆస్వాదించే విధంగా ఈ సరికొత్త టెక్నాలజీతో టీవీ తయారు చేసిన కంపెనీ చెబుతుండడం గమనార్హం. ఈ విషయం తెలిసి ప్రస్తుతం అందరూ షాక్ అవుతున్నారు. ఇన్నాళ్ళ వరకు టీవీ లో వంట కార్యక్రమాలు చూసి ఊరుకోవడం తప్ప ఇలా టేస్ట్ చేయడం మాత్రం కొత్తగా వింటున్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు.