దెబ్బ మీద దెబ్బ.. పాక్ ఉక్కిరి బిక్కిరి?

praveen
మొన్నటి వరకు సరిహద్దుల్లో భారత్ లోకి అక్రమం గా చొరబడి ఉగ్రవాదులు తీవ్ర స్థాయిలో ఉగ్ర కుట్రలు చేస్తూ మారణహోమాలు సృష్టించే వారు. మరోవైపు ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతూ ఎంతో మంది ప్రాణాలు తీసే వారు. ఇలా ప్రాణాలు తీయడమే ఎంతో గొప్ప అని భావించేవారు. కానీ ఇప్పుడు  పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది అన్నది అర్ధమవుతుంది. మత రాజ్యస్థాపన చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్ర  వాదులు ఇక ఇప్పుడు ఆ పాకిస్తాన్ పాలిట శాపంగా మారి పోతున్నారని అర్థమవుతుంది.

 ఎందుకంటే పాకిస్తాన్ లో ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసిన ప్రభుత్వం చైనా కు బానిస గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా చైనా దోచుకు పోతుంటే చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది పాకిస్తాన్. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వ చేతగానితనం తో అటు ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకత కారణంగా ఎంతోమంది తిరుగుబాటుదారులు తెర మీదికి వస్తున్నారు. ఈ క్రమంలోనే బెలూచ్ రెబెల్స్, సింధు రెబల్స్ అంటూ  గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ ఆర్మీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ దాడులకు పాల్పడుతున్న తీరు అక్కడ ప్రభుత్వాన్ని మొత్తం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 కేవలం ఎప్పుడో ఒకప్పుడు కాదు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట పాకిస్తాన్ ఆర్మీ పై ఇలా తిరుగుబాటు దారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల నార్త్ వజీరిస్తాన్లో ఫీన్ లాన్ ప్రాంతం లో సైనికుల పై దాడి జరుగగా.. ఏకంగా ఐదు మంది సైనికులు మరణించారు. అయితే పాకిస్తాన్ లో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లుగా  వ్యవహరిస్తూ ఉండడం అటు పాకిస్తాన్ ఆర్మీ పాలిట శాపం గా మారి పోయింది అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: