ఇలా జరుగుతుందని.. కలలో కూడా అనుకోలేదు?

praveen
ఇటీవల కాలంలో విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నది తెలిసిందే. ఇలాంటి దాడులు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా లో కూడా ఇలాంటి ఒక దాడి జరిగింది. భారత సంతతి కుటుంబం ఒక రేసిజం దాడికి గురైంది. మెల్బోర్న్ లోని లింక్ బ్రూక్ హోటల్లో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. అయితే కుటుంబంలోని ఒక వ్యక్తి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి పాలు అయిన సదరు వ్యక్తి ఇటీవల కోలుకుని జరిగిన విషయాన్ని తెలిపారు.


 గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో తన సోదరుని కాపాడే క్రమంలో 54 ఏళ్ల లిన్ బామ్ దారుణంగా గాయపడ్డాడు. అయితే దుండగులు అతనిపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించటమే కాదు.. దారుణంగా కాలుతో కూడా తన్నారు. అయితే ఇలాంటి అనుభవం తనకు ఎదురవుతుంది అని కలలో కూడా ఊహించలేదు అంటూ ఇటీవల మీడియా ముందు తన బాధను చెప్పుకున్నాడు సదరు వ్యక్తి. దారుణంగా కింద పడేసి కాళ్లతో తన్నారు అంటూ ఎంతో బాధపడిపోయాడు సదరు వ్యక్తి. కారు దిగి హోటల్లో కి వెళ్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు తమ దగ్గరికి వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 మా దేశం నుంచి బయటికి వెళ్ళండి అంటూ బూతులు కూడా తిట్టారు. అయితే భారత సంతతి వ్యక్తులు రేసిజం ఎదుర్కొంటారు అనే విషయం తెలుసు. కానీ ఈ స్థాయిలో ఉత్తమ పై దాడి జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం ఊహించలేదు. ఫిబ్రవరి 12వ తేదీన రాత్రి సమయంలో ఈ దాడి జరిగిందట. ఇటీవల ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది అని భావిస్తున్న కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అక్కడి పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: