బైడెన్ బ్రతుకు పరీక్ష.. దేనికోసమో తెలుసా?
ఈ క్రమంలోనే అమెరికా చెప్పడంతో యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయ్. ఉక్రెయిన్ విషయంలో రష్యా అమెరికా మధ్య యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు బైడెన్ కు పెద్ద పరీక్ష గా మారిపోయింది అని తెలుస్తోంది. యురోపియన్ యూనియన్ నాటో దేశాలు అటు అమెరికా చెప్పిన మాట మీద నిలబడుతూ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నాము అంటూ ప్రకటించాయ్.
కానీ సైనికులను మాత్రం పూర్తిస్థాయిలో పంపించ లేదు అంటూ నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతుండడంతో అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి షాక్ తగిలింది. ఈ క్రమంలోనే నాటో యూరోపియన్ యూనియన్ దేశాలను ఒక్కతాటిపై నడిపించటం ప్రస్తుతం బైడెన్ కు పెద్ద పరీక్ష గా మారిపోయింది. అయితే అటు నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా మాట విన్నప్పటికీ మరో వైపు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూన్న రష్యా ఆయుధాల విషయంలో ఆంక్షలు విధిస్తా అంటూ చెబుతూ నాటో యూరోపియన్ యూనియన్ దేశాలకు భయం పుట్టిస్తూ ఉండటం గమనార్హం ఒకవేళ ఈ సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనే లేకపోతే బైడెన్ రాజకీయ జీవితానికి కూడా ఎంతగానో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఇది బైడెన్ బతుకు పరీక్ష అని అంటున్నారు విశ్లేషకులు.