వెనక్కి తగ్గని ఉక్రెయిన్.. సైనికులను సిద్ధం చేస్తోంది?
ఇలాంటి సమయంలో చిన్న దేశం అయినప్పటికి అటు ఉక్రెయిన్ రష్యా కు లొంగిపోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికి రష్యా ఏకంగా ఉక్రెయిన్ చుట్టూ మూడు లక్షల వరకు సైనికులను మోహరించింది. క్రమక్రమంగా ఆయుధాలను కూడా మొహరిస్తూ ఉండడం గమనార్హం. అయితే అటు చిన్న దేశమైన ఉక్రెయిన్ దగ్గర మాత్రం కేవలం లక్షా యాభైవేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు.
దీంతో రష్యాకు తల వంచ డానికి సిద్ధపడని ఉక్రెయిన్ అటు సైనికుల రిక్రూట్మెంట్ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా సైన్యం తో పోల్చి చూస్తే లక్ష 50 వేల మంది సైనికులు ఉక్రెయిన్ దగ్గర తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా సైనికుల రిక్రూట్మెంట్ చేపట్టిందట ఉక్రెయిన్. అదే సమయంలో మొన్నటివరకు మద్దతు ఇస్తామని ప్రకటించిన నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు కాస్త సైలెంట్ గా మారిపోవడంతో ఇక సొంత శక్తి పైన ఆధారపడేందుకు ఉక్రెయిన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ్.