చైనా ప్లాన్ సక్సెస్.. అప్పుల్లో కూరుకు పోయిన అగ్రరాజ్యం?

praveen
నక్క జిత్తుల మారి చైనా చేసిన కుట్రకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయ్. కరోనా వైరస్ అనే బయో వెపెన్ ప్రయోగించి  అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం సృష్టించాలని అనుకొంది. ముఖ్యంగా అగ్రదేశాలు గా కొనసాగుతున్న అమెరికా బ్రిటన్ జపాన్ లాంటి దేశాలలో అల్లకల్లోలం సృష్టించి దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసింది. దీనికోసం వైరస్ గురించి అన్ని నిజాలు దాచి ప్రపంచ వినాశనానికి కోరుకుంది. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అగ్రదేశాలు గా కొనసాగుతున్న బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లోనే కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది.

 ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా లో ఊహించని రేంజ్ లో కేసులు మరణాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా వరుసగా అమెరికాలో లాక్డౌన్ విధించిన పరిస్థితులు వచ్చాయి. గతంలో ట్రంపు హయాంలో ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తే ప్రస్తుతం బైడెన్ హయాంలో కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే కేసులో వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న అమెరికాకు ఇప్పుడు ఆర్థికసంక్షోభం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి. రోజురోజుకు అప్పుల్లో కూరుకు పోతుంది అమెరికా. ఇలా అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచం  లోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలి అనుకున్న చైనా ప్లాన్ సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

 అగ్రరాజ్యమైన అమెరికా అప్పు మొదటిసారిగా 30 ట్రిలియన్ డాలర్లకు చేరిపోయింది అని ఆ దేశ ట్రెజరీ విభాగం ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా 2019 చివరి నుంచి ఇప్పటి వరకూ జాతీయ రుణం ఏడు ట్రిలియన్ డాలర్ల వరకూ పెరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. జపాన్ చైనా నేతృత్వంలోని పెట్టుబడిదారులకే 8 ట్రిలియన్ డాలర్ల వరకూ అమెరికా బకాయి పడింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా చూస్తుంటే రాబోయే పదేళ్లలో కేవలం 5ట్రిలియన్ డాలర్ల వరకు వడ్డీ ఉంటుంది అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: