పిల్లల్ని కనండి సామి.. వేడుకుంటున్న ప్రభుత్వం?

praveen
ప్రస్తుతం మనదేశంలో రోజురోజుకీ జనాభా పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుటుంబ నియంత్రణ అనే కాన్సెప్ట్ ని తెరమీదకు తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అనే నినాదంతో  భార్య భర్తలు కేవలం ఇద్దరు పిల్లలను మాత్రమే కనేందుకు అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పింది కాదని ముగ్గురు పిల్లలను కంటే కొన్ని రాయితీలు నుండి తప్పిస్తూ ఉండడం గమనార్హం. అయితే భారత దేశంలో ఇలా ఉంటే అటు అగ్రదేశాల లో మాత్రం జనాభా రోజు రోజుకు తక్కువైపోతుంది. ఈ క్రమంలోనే ఇక మానవ వనరులను పెంచుకునేందుకు జననాల రేటు పెంచేందుకు పిల్లలు కనాలి అంటూ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉండటం గమనార్హం.

 ఆయా దేశాలలో మారుతున్న జీవనశైలి.. కారణంగా ఎవరూ కూడా పిల్లలను కనేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో గతంలో ఎన్నో దేశాలలో పిల్లలు కనాలి అంటూ ప్రభుత్వం ఏకంగా ప్రోత్సాహకాలు కూడా అందించేందుకు సిద్ధమైంది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అగ్రరాజ్యాల లో ఒకటిగా కొనసాగుతున్న రష్యా లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రష్యా తీవ్రమైన మానవవనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే పిల్లల్ని కనాలి అంటూ ఇక దేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉండటం గమనార్హం. దేశంలో 14.6 కోట్ల మంది జనాభా ఉన్నారు అని ఇటీవలే రష్యా తెలిపింది.

 అయితే దేశ భౌగోళిక పరిస్థితులు కేసర్గీక  స్వరూపం, రాజకీయ కోణాలను పలు అంశాల ఆధారంగా జనాభా సరిపోరని ప్రభుత్వ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో ఇక రెండేళ్లుగా కరోనా వైరస్ బారినపడి లక్ష మంది కూడా చనిపోయారు. ఇక కొత్తగా జననాల సంఖ్య కూడా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పిల్లలను కనాలి అంటూ ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: