పాపం ఫ్రాన్స్.. అమెరికా పరిస్థితే వచ్చింది?

praveen
చైనా నుంచి పాకిపోయిన కరోనా వైరస్ ను మొదటి దశలోనే ప్రపంచ దేశాలు ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఉప్పు ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా రెండవ దశ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచదేశాలను వణికించింది. ఎన్నో దేశాలలో విపత్కర పరిస్థితులకు కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ లోకి వెళ్ళిపోయి కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చాయి. ఇక రెండవ దశ కరోనా వైరస్ సమయంలో ప్రపంచ ప్రజానీకం మొత్తం అల్లాడిపోయింది అనే చెప్పాలి. ఇక కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది.

 కానీ గత కొన్ని రోజుల నుంచి అగ్రరాజ్యాల లో  కరోనా వైరస్ విజృంభణ తీరు మాత్రం ఎంతో ప్రమాదకరంగానే మారిపోతుంది అని చెప్పాలి. ఒకవైపు సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ప్రమాదకరమైన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా పాకిపోతోంది. అదే సమయంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా కొన్ని దేశాలలో రికార్డు స్థాయిలో వెలుగులోకి వస్తూ ఉండడం ఆందోళనకరంగా మారిపోతుంది. ఇప్పటికే బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో ప్రతి రోజూ లక్షల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అమెరికాలో ఒకేరోజు ఆరు లక్షల వరకు కేసులు వెలుగులోకి రావడంతో అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 ఇక అగ్రరాజ్యాల లో ఒకటి గా కొనసాగుతున్న ఫ్రాన్స్ లో మాత్రం మొన్నటివరకు కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది. రెండు దశ కరోనా నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఆయుధాల తయారీ సహా అన్ని రకాల కార్యకలాపాలను ప్రారంభించింది ఫ్రాన్స్. ఇలాంటి సమయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రం ఆందోళనకరంగా మారిపోతున్నాయి. ఇటీవలే ఫ్రాన్స్ లో రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 1,79,807 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఆరంభం నుంచి ఇప్పటివరకు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఇప్పుడిప్పుడే వ్యాపార వాణిజ్యాలు గాడిలో పెట్టుకుంటూ అన్నిటినీ పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతున్న సమయంలో ఫ్రాన్స్ కు కరోనా వైరస్ షాక్ ఇచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు. దీంతో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: