అఫ్ఘాన్ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన తాలిబ‌న్లు

Dabbeda Mohan Babu
తాలిబ‌న్లు అఫ్ఘ‌నిస్థాన్ ను ఆక్ర‌మించుకుని త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత నాటి నుంచి అఫ్ఘాన్ దేశ ప్ర‌జ‌ల‌పై అనేక ఆంక్షాలు విధిస్తున్నారు. అతి క‌ఠిన మైన ష‌రియ‌త్ చ‌ట్టాన్ని ఆ దేశ ప్ర‌జ‌ల పై ప్ర‌యోగిస్తు హింసిస్తున్నారు. ఎవ‌రైన వీరి పాల‌న కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తే వారి కి క‌ఠిన మైన శిక్ష‌లు విధిస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది ని ఆందోళ‌న ప్ర‌దేశం లోనే కాల్చి చంపుతున్నారు. అయితే అఫ్ఘాన్ దేశంలో బాలికలు చ‌ద‌వ‌డానికి వీలు లేకుండా తాలిబ‌న్లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే మ‌హిళ‌లు ఉద్యోగాలు చేయ‌డానికి అవ‌కాశం లేకుండా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఈ నిర్ణ‌యా ల‌ను వ్య‌తిరేకిస్తు చాలా మంది మ‌హిళ‌లు, చ‌దువు కునే బాలిక‌లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. అలాగే ఆందోళ‌న‌లు చేస్తున్న వారిని తాలిబ‌న్లు అతి కిరాతకంగా కాల్చి చంపారు.


ఆందోళ‌న కు తాలిబ‌న్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళ‌న కారులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ ఆందోళ‌నలు ప్ర‌పంచ దేశాల‌ను కంట త‌డి పెట్టించాయి. ఈ విష‌యం పై ఐక్య రాజ్య స‌మ‌తి లో కూడా ప‌లు మార్లు ప్ర‌స్తా వించారు. అయితే ఈ బాలిక‌ల విద్య విష‌యంలో తాలిబ‌న్లు వెన‌క్కి త‌గ్గార‌ని తెలుస్తోంది. బాలిక‌లు చ‌దువు కోవ‌డానికి అన్ని ఏర్పాట్లు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని యూనిసెఫ్ డిప్యూటీ ఎగ్జీక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఓమ‌ర్ అబ్జీ తెలిపారు. ఆయ‌న గ‌త వారం కాబుల్ లో ప‌ర్య‌టించారు.  బాలిక‌ల విద్య గురించి అక్క‌డి విద్యా శాఖ మంత్రి తో చ‌ర్చించారు. ఈ విష‌యం పై తాలిబ‌న్లు సానుకూలంగా స్పందించారు. అఫ్ఘాన్ లో ఉన్న 34 ప్రావిన్స్ ల‌లో ఇప్ప‌టికే 5 ప్రావిన్స్ ల‌లో బాలిక‌ల‌కు సెకండ‌రీ స్కూలింగ్ ను అనుమ‌తి ఇచ్చార‌ని తెలిపారు. అలాగే మ‌రి కొన్ని రోజల్లో 34 ప్రావిన్స్ ల‌లో బాలిక‌ల‌కు సెకండ‌రీ స్కూలింగ్ ను అనుమ‌తి ఇస్తార‌ని తెలిపారు. దీంతో బాలిక‌ల కు విద్యా అందిచాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌లు చేసిన వారికి ఇదే ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: