రూట్ మార్చిన కిమ్ జోంగ్ ఉన్‌.. ఆ దేశంతో మైత్రి కి రెడీ?

Dabbeda Mohan Babu
ప్ర‌తి సారి ఇత‌ర దేశ‌లపై మాట‌ల తూట‌లు పెల్చే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ త‌న రూట్ మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎప్పుడు ప‌క్క దేశాల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఇత‌ర దేశ‌లపై విషం క‌క్కే వాడు. ముఖ్యంగా ద‌క్షిణ కొరియా, అమెరికా ల‌పై నిత్యం ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేవాడు. త‌మ దేశంలో ఉన్న అణ్వాయుధాల‌తో ఈ దేశ‌ల‌ను బెదిరించే వాడు. యుద్ధానికి కి కూడా కాలు ద‌వ్వ‌డానికి వెన‌క‌డే వాడు కాదు. అలాగే ఉత్త‌ర కొరియా, ద‌క్ష‌ణ కొరియా దేశాల మ‌ధ్య ప‌చ్చి గ‌డ్డి వేస్తే బ‌గ్గు మ‌నేంత శ‌త్రుత్వాలు ఉండేవి. కానీ ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ త‌న రూట్ మార్చుకుని ద‌క్షిణ కొరియా తో మైత్రి చేయ‌డానికి సిద్ధ మ‌య్యారు.

తాజా గా ఉత్త‌ర కొరియా దేశ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కిమ్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. తాము ద‌క్షిణ కొరియా దేశంలో మైత్రి కొరుకుంటున్నామ‌ని తెలిపారు. చాలా సంవ‌త్స రాలు గా మూసి ఉన్న ఆ దేశ స‌రిహ‌ద్ధుల ను సైతం తెర‌వ‌డానికి సిద్ధం గా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా అక్టొబ‌ర్ నెల‌లో ఆ దేశల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దుల‌ను తెరుస్తామ‌ని కూడా తెలిపారు. ఎప్పుడు ద‌క్షిణ కొరియా పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే కిమ్.. ఇప్పుడు ఇలా మైత్రి పాటాలు పాడుతుంటే ప్ర‌పంచ దేశాలు ఆశ్చ‌ర్య పోతున్నాయి. అయితే ఇదే పార్ల మెంట్ స‌మావేశాల్లో అమెరికా దేశం పై నిప్పులు చెరిగాడు. అమెరికా త‌మ కు ఎప్పుడు శత్రు దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ దేశానికి ద‌క్షిణ కొరియా కు మ‌ధ్య గొడ‌వలు పెట్టాల‌ని అమెరికా ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు.

అయితే కిమ్ ద‌క్షిణ కొరియా దేశంతో సంబంధాలు పెంచుకోవ‌డానికి గ‌ల కార‌ణం ఉందని ప్ర‌పంచ మేధావులు అంటున్నారు. ద‌క్షిణ కొరియా దేశంతో సంబంధాలు పెంచుకుని ద‌క్షిణ కొరియా దేశానికి అమెరికా కు మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల‌ను దెబ్బ తీయాల‌ని చూస్తోంద‌ని అంటున్నారు. అలాగే ఈ మ‌ధ్య ఉత్త‌ర కొరియా దేశంలో ఆహార ప‌దార్థాల కొర‌త ను ద‌క్షిణ కొరియా దేశం సాహ‌యం తో ఆ కొర‌త ను తీర్చు కోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని వారి వాద‌న‌. అయితే తాము మాత్రం ద‌క్షిణ కొరియా తో నిజ‌మైన మైత్రి కొరుకుంటున్నామని ఉత్త‌ర కొరియా దేశ ప్ర‌తినిధులు చెబుతున్నారు. అయితే ఈ దేశ‌ల మ‌ధ్య మైత్రి ఎలా దారితీస్తుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: