ఎన్ఆర్ఐ: బైడెన్ కు ఇండియాలో బంధువులు ఉన్నారా ?

VAMSI
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఓడించి అమెరికా పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు నుండి ప్రజలకు ఉపయోగపడే పాలనా పరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసే ఉంటుంది. ఇందులో భాగంగా నిన్న బైడెన్ ను కలిశారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా సంబంధాల గురించి కొంత సమయం ఇరువురు చర్చించుకున్నారు. ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటే మన ఈ సంబంధాలు ఇలాగే కొనసాగుతాయి అన్న విషయంపై మరికొందరు అధికారులతో కలిసి చర్చించుకున్నారు.
ఈ మధ్యలో జో బైడెన్ నరేంద్ర మోడీతో జోక్ వేయడం అక్కడ ఉన్న వారినే కాకుండా ఈ విషయం తెల్సిన వారిని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.  అయితే ఏ విషయంలో బైడెన్ జోక్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.  ఈ సందర్భంగా జో బైడెన్ తన పాత విషయాలను గుర్తు చేసుకున్నాడు. 1972 లో మొదటి సారిగా బైడెన్ సెనేటర్ గా ఎన్నిక అయ్యాడు. ఆ తర్వాతా 2013 లో అమెరికా ఉపాధ్యక్షుడిగా  బైడెన్ ఉన్న సమయంలో భారత్ పర్యటనకు వెళ్ళాడు. ఈ పర్యటనలో ముంబైలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో బైడెన్ అనే పేరుతో ఒక లెటర్ అతనికి వచ్చిందట. ఇది చూసిన బైడెన్ షాక్ కి గుర్యయారట.
అయితే ఇది జరిగిన తర్వాత చాలా మంది అలాగే స్వయంగా బైడెన్ కూడా తనకు ఇండియాలో బంధువులు ఏమైనా ఉన్నారా అని సందేహించాడట.  తనకు ఆ వ్యక్తి రాసిన లెటర్ వచ్చిన రెండవ రోజు బైడెన్ కు అసలు విషయం తెలిసింది. ఇండియాలో తన పేరుతో మొత్తం 5 మంది బైడెన్ లు ఉన్నారని మీడియా ద్వారా తెలుసుకున్నారు . దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధానితో ఇరు దేశాల సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఆశించారు. ఆ విధంగా బైడెన్ కు ఇండియాలో బంధువులు ఉన్నారని తెలుస్తోంది.  అయితే వారు భారత సంతతికి చెందిన వారా లేదా అమెరికా సంతతికి చెందిన వారా తగిన సమాచారం మాత్రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: