అమెరికాకు వెళ్లే వారికి కొత్త నిబంధనలు... సంతోషంలో ఇండియన్స్
వివిధ దేశాల నుండి తిరిగి వస్తున్న వారు కూడా ఒక్క రోజు ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంతే కాకుండా అమెరికాకు చేరుకున్న తర్వాత కూడా మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా సిడిసి తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం విమాన యాన సంస్థలు అమెరికా ప్రయాణించే ఒక్క ప్రయాణికుడి నుండి వారి పూర్తి వివరాలు సేకరిస్తుంది. వారి నుండి ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, అమెరికాలో వారు నివసించే అడ్రస్ లాంటి తదితర వివరాలు తీసుకోవాలి. అప్పుడే ఒకవేళ వారికి పొజిషన్ వస్తే, వారిని కలిసిన మిగతా వారి వివరాలు తెలుసుకుని కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
ఇప్పుడు నవంబర్ నుండి అమలు కానున్న నూతన నిబంధనలను అతిక్రమించినా సక్రమంగా పాటించకున్నా వారిపై తగిన చర్యలు తప్పవని సి డి సి గట్టిగా చెప్పింది. ప్రస్తుతానికి అయితే అమెరికాకు వెళ్ళవలసిన వారు ఆనందించాల్సిన విషయమే. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన నిబంధనలను ఇప్పుడు సడలించింది. ఈ నూతన నిబంధనల పట్ల ఇండియన్స్ అంతా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిబంధనలు అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది.