న్యూయార్క్ అంటేనే భయపడిపోతున్న ఎన్నారైలు..?

Suma Kallamadi
2020 సంవత్సరంలో అమెరికా దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసిన విషయం విధితమే. ఇప్పటికే లక్షలాది మంది అమెరికా పౌరులు కరోనాతో చనిపోయారు. అమెరికా దేశంలోని ప్రముఖ సిటీలన్ని ఆర్థికంగా కుదేలు అయ్యాయి. వాటిలో ప్రముఖ నగరమైన న్యూయార్క్ సిటీ కూడా ఉంది. అయితే కరోనాతో చిగురుటాకులా వణికిపోయిన న్యూయార్క్ నగరం మళ్లీ సాధారణ స్థితికి వస్తుందా? అని అక్కడి నివాసితులు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అలాంటివారి సందేహాలను పటాపంచలు చేస్తూ న్యూయార్క్ నగరం మళ్ళీ యధాస్థితికి చేరుకుంది. కానీ కరోనా తరువాత న్యూయార్క్ మరింత ధనిక నగరంగా మారింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనే పరిస్థితులలో అక్కడి రేట్లు పెరిగిపోయాయి.
కరోనా రాకముందు న్యూయార్క్ లో ఒక సింగిల్ బెడ్రూం  ఫ్లాట్ రెంటుకు తీసుకోవాలంటే 2,800 డాలర్లు అంటే మన కరెన్సీలో 2.04 లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు 2,810 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే దాదాపు 10 డాలర్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అమెరికాలో అత్యంత రిచెస్ట్ సిటీగా శాన్‌ఫ్రాన్సిస్కో ఉండేది కానీ ఇకపై అమెరికాలో అత్యంత ధనిక నగరం గా మారిపోతుంది. ఇకపై ఈ నగరంలో ధనవంతులు తప్ప మరెవరూ నివసించలేరేమో అనిపిస్తోంది.  
అయితే వలస వచ్చిన విదేశీయులు న్యూయార్క్ నగరం అంటేనే భయపడిపోతున్నారు. ఇంటి అద్దె ఖర్చులు పెరగడంతో పాటు అక్కడ అన్ని వస్తువులు ఆహార పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో న్యూయార్క్ లో జీవితం కొనసాగించడం భారమైపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అద్దె ఇళ్లు తీసుకున్న ప్రజలు మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే స్థానిక గవర్నర్ మాత్రం రెంట్ రిలీఫ్ ఫండ్ త్వరలోనే అందజేస్తామని తెలుపుతున్నారు. ఇక భారతీయ ప్రవాసులు సైతం న్యూయార్క్ నగరం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: