తెలుగు విద్యార్థుల కోసం తానా స్పెషల్ ప్రోగ్రామ్..!

Suma Kallamadi
ఉత్తర అమెరికాలో ఏర్పాటైన తెలుగువారి సంఘం తానా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారిని ఏకతాటి పైకి తెస్తోంది. తానా సభ్యులు సాంకేతికతను ఉపయోగించుకొని విదేశాల్లో నివసిస్తున్న పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్నారు. అయితే తాజాగా మరో ముందడుగు వేసి విమానయాన విద్యతో సహా విమాన పైలట్ అనుభవాల పట్ల తెలుగు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నడుంబిగించారు. స్టెమ్ ఫ్లైట్స్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సంస్థతో కలిసి అమెరికా దేశంలో నివసిస్తున్న 11 - 18 ఏళ్ల తెలుగు విద్యార్థుల కోసం ‘తానా స్టెమ్ మిషన్’ అనే ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి పాఠ్యాంశాలలో పట్టు సాధించడానికి సులభమైన విధానాలను తెలియజేయనున్నారు.






రెగ్యులర్ ఏవియేషన్ లో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం.. స్టెమ్ కెరీర్‌లను ఎంచుకోవడానికి తెలుగు విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పటికే మొదటి బ్యాచ్ కు అవగాహన క్లాసులు జరిగిపోయాయి. ఈ క్లాసులను ఆన్‌లైన్ లో నిర్వహించారు.‌ ఇందులో ఆగస్టు 26వ తేదీన పాల్గొన్న మొదట బ్యాచ్ తెలుగు పిల్లలు ప్రశ్నలు అడిగే సమాధానాలు తెలుసుకున్నారు.






అయితే ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకుంటున్న వారు https://nristreams.tv/tana-stem/ వెబ్సైట్ ను సందర్శించాల్సిన ఉంటుంది. అవగాహన క్లాసులు ఇంటర్నెట్ లో కూడా ప్రసారం అవుతాయి. అయితే భవిష్యత్ తరాల వారికోసం కృషి చేస్తూ తెలుగు భాషను కాపాడుతున్న తానా సభ్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. తెలుగు పిల్లల కోసం మరిన్ని విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే తన సభ్యుల సృజనాత్మకత బోధనా విధానం తెలుగు విద్యార్థులను బాగా ఆకట్టుకుంటోంది. దాంతో చాలా మంది పిల్లలు ఈ పాఠ్యాంశాల బోధనకు ఆకర్షితులవుతున్నారు అని తెలుస్తోంది. ఇక భారతదేశంలో నివసిస్తున్న తెలుగువారు సైతం విదేశాల్లో తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేస్తున్న వారిని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: