స్టూడెంట్ వీసాలు జారీ చేయని కెనడా.. ఆందోళనలో ఇండియన్ స్టూడెంట్స్..?

Suma Kallamadi
కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసాల విజ్ఞప్తులను తిరస్కరిస్తోంది. మునుపెన్నడూ చూడని విధంగా గడిచిన రెండు వారాల్లో 60 శాతానికి పైగా స్టూడెంట్ వీసాల అభ్యర్థనలను నిరాకరించింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పరీక్షల్లో మంచి స్కోర్ చేసిన విద్యార్థులకు సైతం దేశంలో ప్రవేశించే అనుమతి లభించడం లేదు. వీసా అప్రూవల్ ప్రాసెస్ పూర్తి చేసి.. ఇక యూనివర్సిటీ ఫీజులు చెల్లించడమే తరువాయి అనే నేపథ్యంలో కెనడా ప్రభుత్వం నిరాశ పరుస్తోంది.
కరోనా సమయంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.  ఈ క్రమంలోనే కెనడాకు వెళ్లేందుకు మూడున్నర లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు వీసా కోసం అప్లై చేశారు.  విమాన ప్రయాణాలు ప్రారంభమైనప్పటికీ.. తక్కువ సమయంలోనే లక్షల మంది విద్యార్థులకు వసతి కల్పించలేమని కెనడా ప్రభుత్వం చెబుతోంది. అందుకే వీసాలు జారీ చేయడం ఆపేసింది. ఆరేడు నెలల తర్వాత మళ్లీ వీసా కోసం అప్లై చేసుకోవాలని ఒక కెనడా అధికారి సూచించారు.
మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు కష్టతరమైన కోర్స్ కోసం అప్లై చేసుకుంటే వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే బాగా మార్కులు వచ్చిన వారు ఈజీ కోర్స్ కు అప్లై చేసుకుంటే.. వారి అభ్యర్థనలను సైతం నిరాకరిస్తున్నారు. వీక్ అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు ఈజీ కోర్సులకు అప్లై చేసుకొని వీసా పొందవచ్చని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అధికారి వెల్లడించారు. మంచి అకడమిక్ రికార్డు తోపాటు ఫైనాన్షియల్ స్టేటస్ ను కూడా పరిగణలోకి తీసుకొని వీసాలను జారీ చేస్తున్నారు.
ఫలానా సబ్జెక్టులో మంచి స్కోర్ సాధించిన విద్యార్థులు.. అదే సబ్జెక్టులో కొత్త కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని కెనడా అధికారులు చెబుతున్నారు. తమ దేశంలో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. పాపులర్ కోర్సులు మినహాయించి కొత్తవి తీసుకునే వారికి వెంటనే వీసా అందిస్తామని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అధికారి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: