గుడ్ న్యూస్: హెచ్1బీ వీసాల మంజూరుకు మరో లాటరీ..

Suma Kallamadi
మొదటి లాటరీలో హెచ్‌1బీ వీసాలు దక్కించుకోలేకపోయిన ఇండియన్ టెకీలకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరొక లాటరీ ద్వారా ఎక్కువమంది విదేశీయులకు హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తామని అమెరికా తెలిపింది. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ తొలత ఒక లాటరీ ద్వారా ఐటీ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలను మంజూరు చేసింది. అయితే మొదటి లాటరీలో చాలా మంది టెకీలు వీసాలు పొందలేకపోయారు. దీంతో వారందరి కోసం రెండో లాటరీ చేపట్టేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ నిర్ణయించింది. మొదటి కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా తక్కువ మందికి వీసా మంజూరు చేశామని.. అందుకే రెండవ లాటరీ చేపట్టామని ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. అయితే గతంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లగా ఆధారంగా ఇప్పటికే కొంత మందిని ఎంపిక చేశామని తెలిపింది. సెలెక్టెడ్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఫైలింగ్ పిటిషన్ ను నిర్ణయించారు.



అయితే సెలెక్ట్ అయిన వారు హెచ్‌1బీ క్యాప్‌ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా 2022లో హెచ్‌1బీ వీసాల కోసం 2021, ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు అప్లై చేసుకున్న భారతీయులను ఫస్ట్ లాటరీ ద్వారా ఎంపిక చేసింది. అమెరికాలోని ఐటీ కంపెనీలలో వృత్తి నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే భారీ సంఖ్యలో విదేశీ వృత్తి నిపుణులను నియమించుకోవడానికి ఐటీ కంపెనీలు సిద్ధమయ్యాయి. అయితే విదేశీ వృత్తి నిపుణుల కోసమని వీసాల మంజూరు చేయడానికి అగ్రరాజ్యం సంప్రదాయ లాటరీ విధానాన్ని పాటిస్తోంది.


ఇప్పుడు కూడా హెచ్‌1బీ వీసాల మంజూరు కోసం రెండో లాటరీ ద్వారా ఎంపిక విధానాన్ని అనుసరిస్తోంది. దీనితో చాలామంది భారతీయులకు హెచ్‌1బీ వీసాలు మంజూరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్కడి కాంగ్రెస్ ప్రకారం ప్రతి ఏడాది ప్రతి ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ గానీ తక్కువ గానీ మంజూరు చేయడానికి వీలు లేదు. దీంతో ప్రతి ఏడాది ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేవలం 65 వేల మంది మాత్రమే హెచ్‌1బీ క్యాప్‌ అప్లికేషన్ పూర్తి చేయాలి. అయితే 65 వేల హెచ్‌1బీ వీసాలతో పాటు మరో 20 వేల హెచ్‌1బీ వీసాలను కూడా అమెరికా మంజూరు చేస్తుంది. ఉన్నత విద్యార్హతలు, మంచి స్కిల్స్ ఉన్న విదేశీయులకు మాస్టర్‌ క్యాప్‌ కింద హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: