అమెరికాలో మిస్సైన భారతీయ బాలిక ఎక్కడ దొరికిందో తెలిస్తే షాకే..!

Suma Kallamadi
జూలై 20వ తేదీన పూజా నఫ్రి అనే 15 ఏళ్ల భారతీయ బాలిక అదృశ్యమయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని బర్కిలీలో నగరంలో అమ్మాయి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం అక్కడి డిటెక్టివ్స్ రాత్రి సమయాల్లో పని చేశారు. ఎట్టకేలకు తప్పిపోయిన బాలిక స్టాక్‌టన్‌ నగరంలోని ఓ 25 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు కనుగొన్నారు. అనంతరం నిందితుడి ఇంట్లో శోధించేందుకు వారెంట్ తెచ్చుకున్నారు. తరువాత అతడి ఇంట్లో ఉన్న పూజా ను కనిపెట్టేందుకు స్టాక్‌టన్‌కు వెళ్లారు.
 
అయితే నిందితుడి ఇంట్లోనే పూజా ఉండటంతో ఆమెను రక్షించారు. అనంతరం పిల్లల దొంగతనం కేసుపై నిందితుడిని అరెస్టు చేశారు. అంతేకాదు ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యకరమైన చర్యలకు ఒడిగట్టినందుకు గాను అతనిపై మరొక కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలపై అదనపు దర్యాప్తు తరువాత చట్టబద్దమైన అత్యాచారం చేశాడన్న అనుమానంతో నిందితుడిని అరెస్టు చేశారు. అయితే బాలిక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే స్పందించారు. అనంతరం ఇండియన్ కమ్యూనిటీ కి సమాచారం అందించారు. దీనితో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయం చేశారు. ఆ కారణంగానే బాలిక ఆచూకీ ఒక్క రోజు వ్యవధిలోనే లభ్యమయింది. దీంతో పోలీసులు ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు.


అయితే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ 15 ఏళ్ల కూతురిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చినందుకు పోలీసులకు, ఇండియన్ కమ్యూనిటీకి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిందితుడు భారతీయ బాలికను ఎలా ట్రాప్ చేశాడు అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అలాగే అతడు గతంలో ఏమైనా నేరాలు చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: