చైనా వైఖరిపై భారత్ మరోసారి ఆగ్రహం..?

Suma Kallamadi
మాట ఇచ్చి తప్పడం లో చైనా ఎప్పుడూ ముందు ఉంటుందని ఎన్నో సందర్భాల్లో నిరూపితమయింది. గత కొద్ది సంవత్సరాలుగా చైనాపై ఎన్నో ఆరోపణలు కూడా వస్తున్నాయి. చైనాలో విజృంభించిన కరోనా కారణంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కరోనా ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఐతే కొద్ది నెలలుగా భారత దేశాన్ని గడగడ లాడించిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వాలు సడలింపులు ప్రకటించడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ప్రజలందరూ ఇంటి బయట అడుగు పెట్టి యధావిధిగా తమ పనులను చేసుకుంటున్నారు.

అయితే విదేశాలకు వెళ్లి పని చేసుకునే వారికి, చదువుకునే వారికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర దేశాలు తాము అభివృద్ధి చేసిన టీకా తీసుకుంటే గానీ తమ దేశంలోకి అనుమతించబోమని ఆంక్షలు పెడుతున్నాయి. చైనా కూడా ఇదే నిబంధన పెట్టింది. తాము తయారుచేసిన టీకా వేసుకుంటేనే ఇతర దేశస్తులను తమ దేశంలో అడుగుపెట్టనిస్తామని చైనా రాయబార కార్యాలయం మార్చి నెలలో వెల్లడించింది. అయితే మన భారత దేశం మాత్రం చైనా దేశస్థుల పై ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. చైనీయుల తోపాటు చైనా నుంచి ఎవరైనా, సరే.. భారతదేశానికి రావొచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కానీ చైనా మాత్రం 2020 నవంబర్ నుంచి వీసాలు జారీ చేయడం ఆపివేసింది.


అయితే ఈ ఏడాది మార్చి నెలలో తమ దేశ టీకా తీసుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే.. వీసా జారీ చేస్తామని ప్రకటించింది. దీంతో భారతీయులు చైనా దేశానికి చెందిన టీకా తీసుకున్నారు కాని వారికి ఇప్పటివరకూ చైనా ప్రభుత్వం వీసా మంజూరు చేయలేదు. దీంతో భారత ప్రభుత్వం చైనా వైఖరిపై ఆగ్రహం వెల్లగక్కుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందిస్తూ త్వరలోనే చైనా భారతీయులకు వీసాలు జారీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. చైనా అధికారులతో మాట్లాడుతున్నామని.. త్వరలోనే ఇండియా చైనా మధ్య ప్రయాణాలు మొదలవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: