ఎన్నారైకి రూ.376 కోట్ల జరిమానా.. 20 ఏళ్ల జైలు శిక్ష.. కారణం అదేనట..?

Suma Kallamadi
విదేశాల్లో నివసించే కొందరు భారతీయులు కోట్ల రూపాయలు సంపాదించాలనే అత్యాశతో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. అధికారులకు దొరకని వారు దొరల్లాగా తిరుగుతుంటే దొరికిన వారు మాత్రం కఠినమైన శిక్షల కింద జైలు పాలవుతున్నారు. తాజాగా అమెరికాలో నివసించే ఒక భారతీయుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు 52 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ.376 కోట్లు చెల్లించాలని అక్కడి న్యాయస్థానం ఎన్నారైకి భారీ షాక్ ఇచ్చింది.
2020 అక్టోబర్ నెలలో 39 ఏళ్ల త్రివిక్రమ్ రెడ్డి తాను ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా కుట్రకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. మెడికేర్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను బురిడీ కొట్టించే అతిపెద్ద కుంభకోణం లో త్రివిక్రమ్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు. ఇతర డాక్టర్ల ఐడెంటిఫికేషన్ దొంగలించి.. వారి చేత చికిత్స చేయించినట్లు చెబుతూ తప్పుడు పేషెంట్ల బిల్లులను సృష్టించి త్రివిక్రమ్ రెడ్డి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. జూన్ నెల 2019 లో ఫెడరల్ ఏజెంట్స్ త్రివిక్రమ్ రెడ్డి మెడికల్ క్లినిక్ ని పరిశీలించగా.. మెడికల్ బిల్లులన్నీ కూడా మోసపూరితమైనవని తేలింది. అయితే ఫెడరల్ అధికారులు దర్యాప్తు చేసిన అనంతరం తన మెడికల్ క్లినిక్ ని క్లోజ్ చేసి.. తన బిజినెస్ ని నిలిపివేశాడు. అయితే ప్రాసిక్యూటర్లు త్రివిక్రమ్ రెడ్డి తన క్లినిక్ క్లోజ్ చేసిన తర్వాత 55 మిలియన్ల అమెరికన్ డాలర్లను వేరే బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని కోర్టుకి తెలిపారు.
అయితే ప్రజల్లో డాక్టర్ల పట్ల ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నందుకు గాను త్రివిక్రమ్ రెడ్డి పై అమెరికా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే 52 మిలియన్ల డాలర్లు నష్టపరిహారం గా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎవరైతే డాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారో వారందరికీ త్రివిక్రమ్ రెడ్డి కి విధించిన కఠినమైన శిక్షలను విధిస్తామని హైకోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: