అగ్ర రాజ్యం
అమెరికా అట్టుడుకుతోంది. ఒక పక్క కరోనా మరణాలు, కేసులతో సతమతమవుతున్న అమెరికన్స్ మరో పక్క అధ్యక్షుడి ఎంపికలో జరిగుతున్న పరిణామాలతో జుట్లు పీక్కుంటున్నారు.అమెరికాలో తాజాగా చోటు చేసుకుంటున్న సంఘటనలు
అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడలేదని, మొట్ట మొదటి సారిగా ఇలాంటి పరిణామాలు చూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
క్యాపిటల్ భవనం ముట్టడిని ఆ తరువాత జరిగిన పరిణామాలను
అమెరికా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ట్రంప్ బిడెన్ ఎన్నికను నిలిపివేయడానికి పన్నిన కుట్రలన్నీ ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇక ఆఖరి అస్త్రంగా
అమెరికా క్యాపిటల్ ముట్టడి ద్వారా బిడెన్ ను ఎన్నుకునే
అమెరికా కాంగ్రెస్ మీటింగ్ ని జరగకుండా చెయాలని భావించారు..ఈ మేరకు
ట్రంప్ పిలుపు మేరకు
అమెరికా నలుమూలల నుంచీ ఎంతో మంది అమెరికన్స్ వాషింగ్టన్ చేరుకున్నారు. ర్యాలీ గా వచ్చిన
ట్రంప్ మద్దతు దారులు
అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో రంగంలోకి దిగిన
కేంద్ర బలగాలు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బలగాలు చేసిన కాల్పులలో ఓ
మహిళ మృతి చెందగా మరో ముగ్గురు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో
వైట్ హౌస్ కీలక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో జరుగుతున్న ఘర్షణలు ఎంతో బాధించాయని, ఈ పరిణామాలపై తాము ఎంతో కలత చెందామని, అందుకు నిరసనగానే
వైట్ హౌస్ లోని తమ బాధ్యతలకు
రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇలా
రాజీనామా ప్రకటించిన వారిలో మేలానియా
ట్రంప్ కార్యదర్శి గ్రిషామ్ ముఖ్యులుగా ఉండగా,
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ మాధ్యూస్ కూడా ఉన్నారు. వీరిద్దరితో పాటుగా మరికొందరు కూడా త్వరలో
రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.
ట్రంప్ ఈ నిరసనలను ప్రోశ్చహించడం తమకు ఏ మాత్రం నచ్చలేదని
అమెరికా క్యాపిటల్ పై దాడి జరగడంలో
ట్రంప్ ఓ అధ్యక్షుడిగా ఉంటూ ప్రాధాన పాత్ర పోషించారని అమెరికన్స్ ఆవేదన చెందుతున్నారు.