వ్యాక్సిన్ కోసం ఆ దేశ ప్రధానితో మోడీ చర్చలు

Gullapally Venkatesh
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్టడానికి గానూ బ్రిటన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ని మార్కెట్ లో వచ్చే వారం నుంచి విక్రయిస్తుంది అక్కడి సర్కార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ వ్యాక్సిన్ అనేది ఆ దేశానికి చాలా కీలకం. కరోనా వ్యాక్సిన్ ని తయారు చేసామని చెప్పిన రష్యా మార్కెట్ లో విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు 95 శాతం ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాక్సిన్ ని మార్కెట్ లో ప్రవేశ పెట్టడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు భారత్ కి కూడా ఆ వ్యాక్సిన్ అనేది చాలా కీలకం అనే చెప్పాలి. మన దేశంలో కనీసం వైద్యులకు, పోలీసులకు అయినా సరే ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. దీనితో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ సర్కార్ తో చర్చలు జరుపుతుంది. త్వరలోనే ఆ దేశ ప్రధానితో భారత ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది అని సమాచారం. కనీసం భారత్ కి ఇప్పుడు 16 కోట్ల వ్యాక్సిన్ లు కావాల్సి ఉంది. వైద్య సంరక్షణ కార్మికులకు కూడా ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరం అనే చెప్పాలి. ఈ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశం తర్వాత తెలుస్తుంది.

ఇక ఈ వ్యాక్సిన్ కోసం అమెరికా కూడా ఆసక్తిగా చూస్తుంది. ఈ వ్యాక్సిన్ ని అమెరికా ప్రజలకు ఇచ్చి తాను వెళ్ళే ముందు మంచి వాడిని అనిపించుకోవాలి అని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. మరి ఇది ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి. ఇక అమెరికాలో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే అనేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ వ్యాక్సిన్ మన దేశంలో ఆ దేశంలో అందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: