గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడుతున్న ఎన్నారైలు...!

Gullapally Rajesh
మధ్య ప్రాచ్య దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారు అయిందా...? గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఏ మాత్రం కూడా బాగా లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అక్కడ ఉండే  ఇతర దేశాల వాళ్ళు నరకం చూస్తున్నారా...? దీనికి కూడా అవును అనే సమాధానమే ఇప్పుడు వినపడుతుంది. మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి స్థిరపడిన వారు  చాలా ఎక్కువగా ఉంటారు. వారికి అక్కడ అవకాశాలు ఎక్కువగానే ఉంటారు. కేరళ సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

అయితే ఈ కరోనా సమయంలో వారు అక్కడ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా గల్ఫ్ దేశాలు అక్కడ ఉన్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో  విదేశీయులకు అవకాశాలు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలోనే కరోనా కారణంగా చాలా మందిని ఉద్యోగాల నుంచి పీకేశారు. వారిలో ఇండియాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీనితో ఎన్నారైలకు ఇప్పుడు  గల్ఫ్ దేశాల్లో చాలా కష్ట కాలం నడుస్తుంది అని నిపుణులు అంటున్నారు.

గల్ఫ్ దేశాలు చాలా వరకు కూడా అక్కడి వారినే తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి గాని శ్రీలంక, భారత్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన వారిని కూడా పక్కన పెట్టేస్తున్నాయి. దీనితో వేలాది మంది ఇప్పుడు రోడ్డున పడి మన దేశానికి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నారైల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది అని పలువురు హెచ్చరిస్తున్నారు. దీనితోనే రాబోయే ఆరు నెలల్లో మన దేశానికి ఎక్కువ మంది తిరిగి రావొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చేస్తున్నా సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: