మానవత్వం చాటుకున్న భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త!

Edari Rama Krishna

ప్రపంచం మొత్తం కరోనాతో వణికి పోతుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా మహమ్మారి రోజు రోజు కీ తన ప్రతాపాన్ని చూపించుకుంటుంది. అయితే కరోనా వైరస్ కి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు. దాంతో మనం జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నుంచి రక్షించుకోగలుగుతాం అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాజిక దూరం..  మాస్క్ ధరించడం.. ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. అయితే కరోనా ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో వివిధ రాష్ట్రాల్లో.. దేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులు నానా యాతన పడుతున్నారు.దేశంలో వారికి సహాయం చేయడానికి స్వచ్చంద సంస్ధలు ముందుకు వచ్చాయి.

ఇక నటులు సోనూసూద్, అమితాబచ్చన్ అయితే బస్సులు, ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా  దుబాయ్‌లో ఉండే  భార‌త సంత‌తికి చెందిన వ్యాపార‌వేత్త త‌న కంపెనీలో ప‌నిచేసే ఉద్యోగులను స్వ‌దేశానికి త‌రలించేందుకు ప్ర‌త్యేకంగా చార్ట‌ర్ విమానం ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటారు.  ఒకటి కాదు రెండు కాదు.. సుమారు 125 మంది ఉద్యోగుల‌ను షార్జా నుంచి కేర‌ళ‌లోని కొచ్చికి పంపించే ఏర్పాటు చేశారు ఎలైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ఆర్ హ‌రికుమార్. 

జూన్ 15న షార్జా నుంచి బ‌య‌ల్దేర‌నున్న ఎయిర్ అరేబియా విమానం మొత్తం 168 ప్ర‌యాణికుల‌తో భార‌త్‌కు రానుంది. ఈ నేపథ్యంలో 125 మంది ఉద్యోగుల‌కు పూర్తి ఉచితంగా త‌న సొంత ఖ‌ర్చుల‌తో స్వ‌దేశానికి పంపిస్తున్న‌ట్లు హ‌రికుమార్ తెలిపారు.   ప్ర‌స్తుతం ఉద్యోగుల‌ను మూడు నెలల సెలవులో భార‌త్‌కు పంపుతున్నట్లు చెప్పిన ఆయ‌న‌... పరిస్థితి సాధారణమైనప్పుడు వారు తిరిగి రావడానికి కూడా ఏర్పాట్లు చేస్తానని చెప్పారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: