మీ నియమాన్ని మార్చండి..కేంద్రానికి ఎన్నారైల డిమాండ్...!!!

VIKRAM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృతి చెందారు..లక్షలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోయాయి. కరోనా నివారణ చర్యలలో భాగంగా  అన్ని దేశాలు ముందుగా విమానయాన వ్యవస్థని తాత్కాలికంగా రద్దు చేసింది. దాంతో ఎంతో మంది ఎన్నారైలు భారత్ నుంచీ విదేశాలు వెళ్ళడానికి వీలులేక ఇండియాలోనే ఉండిపోయారు. అయితే ఇక్కడ పెద్ద చిక్కొచ్చి పడింది..

అమెరికాలోని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అనే సంస్థ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఓ లేఖని రాసింది. ఫైనాన్స్ యాక్ట్ 2020 ద్వారా అమలు చేయబడిన 120 రోజుల నియమం ఎంతో మంది ప్రవాస భారతీయులకి నష్టం చేకూర్చే విధంగా ప్రస్తుతం ఉందని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి 120 రోజులకంటే తక్కువగా ఇండియాలో ఉంటే  అతడు ఎన్నారై గా గుర్తించ బడుతాడు..అయితే  

విదేశాలలో సంపాదించిన డబ్బుకి ఓ ఎన్నారై గా భారతదేశంలో పన్ను నుంచే మినహాయింపు ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశాలకి వెళ్ళలేక ఉండిపోయిన ఎన్నారైలు ఈ 120 రోజుల నియమం ప్రకారం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చార్టెడ్ అకౌంటెంట్ లు అంటున్నారు. కాబట్టి ఈ 120 రోజుల నియమాన్ని 180 రోజులకి మార్చాలని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ కేంద్రానికి డిమాండ్ చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: