మరో ప్రమాదం అంచున అమెరికా...భగవంతుడుగా నువ్వే కాపాడాలి..!!!

NCR

అమెరికాలో కరోనా సృష్టిస్తున్న విలయతాండవం ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. అగ్ర రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ సుమారు 18,900మందిని పొట్టనబెట్టుకోగా దాదాపు 4,99,000 వేలమంది కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఒక వైపు కరోనా కారణంగా అగ్ర రాజ్యం ఆర్ధికంగా కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది . దాంతో ప్రజలందరూ ఆహారపదార్ధాల కోసం గంటల తరబడి ఫుడ్ బ్యాంక్ ల వద్ద వేచి చూడాల్సి వస్తోంది..ఈ క్రమంలోనే అమెరికాని మరో మహమ్మారి హరికేన్ ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిద్దంగా ఉందని అంటున్నారు అధికారులు.

అమెరికాలో హరికేన్లు తరుచుగా వస్తూనే ఉంటాయి. అమెరికా ప్రజలకి అవి కొత్తేమి కావు. అలాగే హరికేన్లు వచ్చినప్పుడు అధికారులు లక్షల మందిని వాటి ప్రభావం లేని ప్రాంతాలకి తరలిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అమెరికాలో ఎవరిని ఎక్కడికి తరలించడానికి లేదు. అయితే ఈ సారి భారీ గాలులతో కూడిన బలమైన నాలుగు హరికేన్లు రానున్నట్టగా దృవీకరించారు.

ఈ హరికేన్ల దాడి చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుందని ముఖ్యంగా హరికేన్లు ఫ్లోరిడా ప్రాంతంలోనే అధికంగా వస్తాయని వీటి నష్టం ఊహించడానికి కూడా వెళ్ళు ఉండదని అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో లాక్ డౌన్ వలన ఎంతో మంది ఉద్యోగాలకి వెళ్ళక పోవడంతో డబ్బులు కూడా లేని పరిస్థితి. అదే సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. దాంతో  ఈ హరికేన్లు సృష్టించే ఆస్తుల నష్టం ఎలా భరించాలో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా ప్రజలు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: