బిల్ క్లింటన్ మోనికా కామకేళిని బయటపెట్టిన మహిళ మృతి...?
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్ హౌస్ ఉద్యోగిని మోనికా అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన లిండా ట్రిప్ కేన్సర్ తో బాధ పడుతూ రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఆమె లాయర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. లిండా మోనికాతో స్నేహం చేసి వారిద్దరి సంభాషణలను బయటి ప్రపంచానికి వెల్లడించారు. బిల్ క్లింటన్ తో శారీరక సంబంధం ఉందని మోనికా చెప్పడంతో లిండా ఆ మాటలను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేశారు.
అప్పట్లో మోనికా తనకు తెలియకుండా లిండా మాటలను రికార్డ్ చేసిందని కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంలో కొందరు లిండాను ప్రశంసిస్తే మరికొందరు మాత్రం ఆమెను మిత్ర ద్రోహిగా పేర్కొన్నారు. 70 ఏళ్ల వయసులో మరణించిన లిండా ట్రిప్ 48 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుని కొలంబియాలో నివశించారు. గత 20 సంవత్సారాల నుంచి లిండా కేన్సర్ తో బాధ పడుతున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆమె ఒకప్పటి స్నేహితురాలైన మోనికా లిండాతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి కొన్ని రోజుల క్రితం ఆమె కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూశారు. గతంలో లిండా చేసిన ఆరోపణలను అంగీకరించని బిల్ క్లింటన్ కొన్ని రోజుల క్రితం ఆ ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నారు. 2001లో క్లింటన్ పదవీకాలం ముగిసిన తర్వాత లిండాను పదవి నుంచి తొలగించారు. అనంతరం ఆమె వర్జీనియాకు వెళ్లి సొంతంగా క్రిస్మస్ స్టోర్ నడుపుకుంటూ జీవనం సాగించారు.