అమెరికాలో "సిక్కు విద్యార్ధికి"...ఘోర అవమానం...!!!!

NCR

అమెరికాలో ఓ సిక్కు విద్యార్ధికి అవమానం జరిగింది. నువ్వు తలపాగా ధరించి లోపాలకి రాకూడదు అంటూ ఓ హోటల్ సెక్యూరిటీ సిక్కు విద్యార్ధిని అనుమతించలేదు. దాంతో అవమానానికి లోనయిన అతడు మేనేజర్ వద్దకి వెళ్లి చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ఘోరమైన అవమాన భారంతో అతడు వెనుతిరిగాడు. ఈ విషయం ఆనోటా ఈ నోటా స్థానిక మేయర్ కి తెలియడంతో మేయర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వివరాలలోకి వెళ్తే...

 

అమెరికాలో ఓ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ సిక్కు విద్యార్ధి అయిన గుర్వీందర్ సింగ్ అనే యువకుడు తన స్నేహితులని కలిసేందుకు అక్కడే ఉన్న పోర్ట్‌ జెఫర్‌సన్‌లోని హర్బర్‌ గ్రిల్‌ బార్‌కి వెళ్లాడు. అయితే అక్కడి భద్రతా సిబ్బంది తలపాగాతో ఉన్న అతడిని లోనికి రానివ్వలేదు. దాంతో మనస్తాపానికి లోనయిన అతడు ఎందుకు తనని లోనికి రానివ్వడంలేదని మేనేజర్ ని సంప్రదించాడు.

 

తలపాగా ధరించడం మా సాంప్రదాయం అని చెప్పినా అనుమతి నిరాకరించారు. ఈ ఘటన మీడియా ద్వారా తెలుసుకున్న స్థానిక మేయర్ గుర్వీందర్ కి క్షమాపణలు తెలిపింది. తప్పకుండా సదరు హోటల్ పై చర్యలు తీసుకుంటామని, మీకు జరిగిన అవమానానికి చిన్తిస్తున్నామని తెలిపారు.  ఇదిలాఉంటే మేయర్ స్పందించిన తరువాత స్పందించిన హోటల్ యాజమాన్యం సిక్కు విద్యార్ధికి సోషల్ మీడియాలో క్షమాపణలు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: