భారత ఐటీ కంపెనీ పై సంచలన తీర్పు..

NCR

అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలలో అత్యధికంగా భారతీయ కంపెనీలు ఉన్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది ఐటీ రంగ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ అక్కడ వివిధ కంపెనీలని కూడా స్థాపించి ఆర్ధికంగా స్థిరపడిపోయారు. అంతేకాదు స్థానిక ఐటీ కంపెనీలకి భారత ఐటీ కంపెనీలు ఎంతో పోటీని కూడా ఇస్తున్నాయి..ఈ క్రమంలోనే

 

అమెరికాలో ఎంతో పేరు సంపాదించుకున్న టీసీఎస్ కంపెనీ పై గతంలో దక్షిణ ఆసియా ఉద్యోగులు కోర్టులో దావా వేశారు..తమని జాతి వివిక్ష కారణంలో ఉద్యోగాల నుంచీ తొలగించారని అందుకు గాను మాకు న్యాయం చేయాలని కోరుతూ కాలిఫోర్నియా లోని కోర్టుని ఆశ్రయించారు..దాంతో పలురకాలుగా విచారణలో చేపట్టిన కోర్టు భారతీయ కంపెనీపై వచ్చిన ఆరోపణలు సరైనవి కావంటూ అవన్నీ అసత్యాలుగా పేర్కొంది.

 


టీసీఎస్ ఎటువంటి జాతి వివక్ష చూపలేదంటూ తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా టీసీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంచలనం సృష్టించింది..దాంతో అమెరికా కోర్టు తీర్పుపై టీసీఎస్ తో పాటు మరో కొన్ని కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: