సస్పెండ్‌ చేసింది హెచ్‌1-బిని కాదు..!!

Shyam Rao
భారతీయ ఐటి కంపెనీలు, నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్‌1-బి వీసాల జారీ ప్రక్రియపై అమెరికా పౌరసత్వ, వలస విభాగం (యుఎస్‌సిఐఎస్‌) శుక్రవారం వివరణ ఇచ్చింది. హెచ్‌1-బి వీసాల కార్యక్రమాన్ని సస్పెండ్‌ చేయలేదని, దానికి సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్‌ను మాత్రమే తాత్కాలికంగా నిలుపుచేశామని యుఎస్‌సిఐఎస్‌ తాత్కాలిక డైరెక్టర్‌ లోరీ సియలబ్బా స్పష్టం చేశారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభకు చెందిన ఆంతరంగిక భద్రత సబ్‌ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు.



‘ఏటా హెచ్‌1-బి వర్క్‌ వీసాల కోసం ఏప్రిల్‌ 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంటాం. తొలివారంలోనే 2.40 లక్షల దరఖాస్తులు వస్తాయి. 15 రోజుల్లో వీటిని ప్రాసెస్‌ చేయడం అసాధ్యం. ఆ రద్దీని తగ్గించేందుకే ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశాం. సస్పెన్షన్‌ ఎత్తివేయగానే ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని 15 రోజుల్లో పరిష్కరిస్తాం. అదీగాక ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకునేవారు ఈ విషయం గమనంలో ఉంచుకోవాలి. ఏ సందర్భంలోనైనా అక్టోబరు దాకా వీసాలు మంజూరు కావు కదా! అందుకే వీసా జారీలో ఆలస్యం జరుగుతోందని అనుకోరాదు’ అని అన్నారు. ప్రీమియం ప్రాసెసింగ్‌కు గతంలో గరిష్ఠంగా మూడు నెలలు పట్టేదని, గతంలోనూ సస్పెండ్‌ చేసిన సం దర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు డేటాను సిస్టమ్‌లో నిక్షిప్తం చేయగానే.. ప్రీమియం ప్రాసెసింగ్‌కు అవకాశమిస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని సియలబ్బా వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: