శేఖర్ కమ్ముల కహానీ

Chowdary Sirisha
కహానీ... సంచలనాలకు మారుపేరయిన సినిమా. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ సినిమాలో విద్యాబాలన్ కథానాయిక. ఏమాత్రం గ్లామర్ లేని పాత్రలో నటించినా అందరి ప్రశంసలూ అందుకుంది. ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ చిత్రం... ఏకంగా 104 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కహానీని తెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా ఆసక్తిని కనబరిచారట. ఆయనే తెలుగులో దీన్ని తీయాలని అనుకుంటున్నారట. ఆయన తరహాలో దీన్ని మలుస్తారో లేదంటే అదే కథను తెలుగులో తీస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: