మనోడు నిలబడాలి

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా... ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్నది మూడు వంశాలే. వారి వారసులే టాప్ హీరోలు. వారివారి వారసులే యువ హీరోలు. ఇప్పుడు మరో వంశం తెరమీదికి వస్తోంది. అదే... నారావారి వంశం. మొదటి చిత్రం ‘బాణం’లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రోహిత్. తరువాతి చిత్రంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ‘ఒక్కడినే’ అంటూ ముందుకొస్తున్నాడు. ఈ ఒక్కడినీ సినీ పరిశ్రమలో ఎలాగైనా నిలబెట్టాలని భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. నారా రోహిత్ సినిమా రిలీజ్ కి భారీ ప్రణాళికే వేస్తున్నారట. కొంతమంది నాయకులే ఈ వ్యవహారం మొత్తం చూస్తున్నారని సమాచారం. ‘ఒక్కడినే’ చిత్రానికి భారీ ఓపెనింగులు రాబట్టి రోహిత్ ని కమర్షియల్ హీరోగా ఒక మెట్టు పైకి ఎక్కించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా మనోడి కూడా మాస్ హీరో చేయాలని నారావారు ఆశపడుతున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మనవాడు కూడా సినిమాల్లో కాస్త పేరు సంపాదిస్తే అన్నిరకాలుగా మంచిదని వాళ్లు ఆలోచిస్తున్నట్టు టాక్. మరి, ఈ ఆశలన్నింటినీ రోహిత్ ఎలా మోస్తాడో తెరపైనే చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: