క్రికెటర్ తో ప్రేమలో పడిన హన్సిక..?
అదేమిటంటే హన్సిక క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు జోరుగా వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం హన్సిక ఎక్కువగా హారర్ నేపథ్యంలో ఉన్న స్టోరీలు పెంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. ఇటువంటి క్రమంలో అటువంటి స్టోరీ కలిగిన సినిమాలో హన్సిక సరసన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. అది కూడా ప్రతినాయకుడి పాత్రలో కావడం విశేషం. హరి శంకర్, హరీశ్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. వీరు గతంలో ‘అంబులి’ అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీశాంత్ క్రికెట్ కు దూరం అయిన తర్వాత...మెల్లమెల్లగా సినిమా ఇండస్ట్రీకి దగ్గర అయ్యి ఇటీవల సినిమాలు చేస్తూ కెరీర్ని రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో శ్రీశాంత్ ‘టీమ్ 5’ అనే సినిమా చేయడం జరిగింది. కాగా హన్సిక తో చేస్తున్న సినిమా విడుదల కాకముందే వీరిద్దరిపై ఇటువంటి వార్తలు వస్తున్న క్రమంలో వీరిద్దరు చేసిన సినిమాపై కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మరోపక్క హన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీ కుర్ర హీరో సందీప్ కిషన్ సరసన ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’ సినిమాలో నటిస్తోంది.