టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు. పది సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించిన చిరంజీవి తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని డ్యాన్స్, ఫైట్స్ తో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన 'సైరా' సినిమా పనులతో బిజీగా వున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.
సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ శబ్దాలయాలో డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఉయ్యాలవాడ గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్, సతీమణి సిద్ధమ్మ పాత్రలో నయనతార, ఇతర కీలక పాత్రల్లో తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, కిచ్చా సుదీప్ లు నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు చిరంజీవి.
అయితే ఈ మూవీలో మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపించబోతున్నారట..ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి ఒబెసిటీ కాస్త తగ్గించుకుని, స్టైలిష్‌గా తయారవ్వాలని కొరటాల చెప్పాడట. ఇందుకు చిరూ కూడా ఓకే అన్నారని, డైట్ స్టార్ట్ చేసి, జిమ్‌కి కూడా వెళుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.